s 400 missile system: పంజాబ్‌లోని వైమానిక స్థావ‌రం- చైనాకు, పాకిస్థాన్‌కు చుక్క‌లే!

s 400 missile system ఢిల్లీ: భార‌త ప్ర‌భుత్వం ర‌ష్యా దేశం నుంచి కొనుగోలు చేసి అత్యాధునిక క్షిప‌ణి వ్య‌వ‌స్థ ఎస్‌-400 రెజిమెంట్‌ను దేశంలోని పంజాబ్‌లోని వైమానిక స్థావ‌రంలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు భార‌త సైన్యం తాజాగా ప్ర‌క‌టించింది. 2022 ఫిబ్ర‌వ‌రి నెల‌లోగా ఈ అధునాత‌న క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు తెలిపింది. ఎస్‌-400 క్షిపణి(s-400) ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని పేర్కొంది.

క్షిప‌ణి విడి భాగాలు త‌ర‌లింపు

ఈ ఎస్‌-400 (s-400) క్షిప‌ణి యొక్క అతి ముఖ్య‌మైన విడి భాగాలు, ఇత‌ర ప‌రిక‌రాల‌ను త‌ర‌లిస్తున్న‌ట్టు సైన్యాధికారులు తెలిపారు. క్షిప‌ణి ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌య్యే స‌రికి మ‌రో ఆరు వారాల స‌మ‌యం ప‌డుతోంద‌ని అన్నారు. ఇది అందుబాటులోకి వ‌స్తే ఉత‌ర్త సెక్టార్‌లోని చైనా స‌రిహ‌ద్దు ప్రాంతంతో పాటు పాకిస్థాన్ స‌రిహ‌ద్దు క్షిప‌ణి ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని వివ‌రించారు.

మొద‌టి నుంచి ర‌క్ష‌ణ రంలోకి కీల‌క ఆయుధ సామాగ్రిని ర‌ష్యా నుంచి భార‌త్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తోంది. ఈ క్ర‌మంలో ర‌ష్యా నుంచి ఎస్‌-400 గ‌గ‌న‌త‌ల రక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను కొనుగోలు చేసుకునేందుకు 2018 సంవ‌త్స‌రం అక్టోబ‌ర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది.

ఎస్‌-400

క్షిప‌ణుల(s 400 missile system) కోసం రూ.500 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చు

ఈ క్షిప‌ణుల కొనుగోలు కోసం భార‌త ప్ర‌భుత్వం రూ.500 కోట్ల డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేస్తోంది. ఇప్ప‌టికే 2020 సంవ‌త్స‌రంలో 800 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ర‌ష్యాకు చెల్లించింది. ఈ విష‌యంపై తొలి నుంచి అమెరికా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ వ‌స్తూనే ఉంది. ఎస్‌-400 క్షిప‌ణి ర‌ష్యా రూపొందించిన అత్యాధునిక క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌. దీర్ఘ శ్రేణిలో ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న‌త‌లంలోని ల‌క్ష్యాల‌ను చేధించ‌గ‌ల‌దు. 400 కి.మీ దూరంలోని శ‌త్రువుల విమానాలు, క్షిప‌ణులు, డ్రోన్ల‌ను ధ్వంసం చేసే స‌త్తా, సామ‌ర్థ్యం క‌ల‌దు.

Share link

Leave a Comment