Russian Vigilante Hacke | యుక్రెయిన్‌కు మద్దతుగా హ్యాకర్ల రంగంలోకి దిగారు. రష్యాపై సైబర్ యుద్ధం ప్రకటించారు. రష్యా చేస్తున్న మారణ హోమం దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న యుక్రెయిన్ దేశంకు ప్రపంచ దేశాలు సపోర్టు ఇవ్వని తరుణంలో హ్యాకర్లు ముందుకొచ్చారు. ఒంటరిగా పోరాడుతున్న యుక్రెయిన్‌కు మేమున్నామంటూ హ్యాకర్లు భరోసా ఇస్తున్నారు. రష్యాలోని సైట్లపై (Russian Vigilante Hacke) దండెత్తుతున్నారు.
యుక్రెయిన్‌పై యుద్ధంకు దిగిన రష్యా ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఎన్నో దేశాలు, ఆఖరికి ఐక్యరాజ్య సమితి చెప్పినప్పటికీ రష్యా తగ్గేదె లే అంటుంది. దీంతో హ్యాకర్లు అంతా ఒక్కటై రష్యా సాంకేతిక రంగంపై యుద్ధం చేస్తున్నారు. యుక్రెయిన్‌లో రష్యా యుద్దాన్ని కట్టడి చేసేందుకు తన వంతు పాత్ర పోషిస్తోంది ఓ ప్రైవేటు సైబర్ గ్రూపు. యుక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి ధీటుగా తాము పదుల సంఖ్యలో రష్యన్ సైట్లను హ్యాక్ చేసినట్టు anonymous cyber గ్రూపు పేరిట సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శినమిచ్చాయి. మరో వైపు తమ అధికారిక వెబ్సైట్లు హ్యకింగ్ అయినట్టు రష్యన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. రష్యన్లకు సంబంధించిన కొన్ని వెబ్సైట్లు నెమ్మదించగా, మరికొన్ని వెబ్సైట్లు ఆఫ్‌లైన్ అయ్యాయని రష్యన్ ప్రభుత్వం పేర్కొంది. యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో పెద్ద ఎత్తున రష్యా బాంబు దాడులకు పాల్పడనున్నట్టు యనామనస్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ సైబర్ దాడి జరిగింది.

- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!