Sputnik V Vaccine : రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ – వి టీకా అత్యవసర విమానంలో హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. వీటిని రెడ్డీస్ ల్యాబ్లో నిల్వ చేయనున్నారు.
Sputnik V Vaccine : కరోనాతో విలవిల్లాడుతున్న భారత దేశానికి రష్యా ఆపన్నహస్తం అందించింది. ఈ సందర్భంగా రష్యా అభివృద్ధి చేసిన కరోనా టీకా స్పుత్నిక్- వి డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నాయి. 1.5-2 క్షల వయల్స్ తొలి విడతలో భారత దేశానికి చేరుకోనున్నట్టు ఇటీవల రష్యాలోని రాయబారి బాల వెంకటేశ్ వర్మ తెలిపారు. శనివారం నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడం, మరోవైపు టీకాల కొరత వేధిస్తున్న తరుణంలో స్పుత్నిక్ – వి టీకాలు భారత్ చేరుకోవడం ఊరట కలిగించే అంశం. ఇక ఈ నెలలోనే భారత్లో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభించినట్టు తెలుస్తోంది. దేశీయంగా స్పుత్నిక్- వికి సంబంధించిన క్లినికల్ ట్రయల్న్ను ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్(dr.reddys lab) చేపట్టిన విషయం తెలిసిందే.
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ – వి టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కొద్ది రోజుల క్రితమే అనుమతించింది. రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో గమలేయా ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న స్పుత్నిక్ – వి టీకాను భారత్లో ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు గతేడాది సెప్టెంబర్లోని రెడ్డీస్ సంస్థతో ఒప్పందం కుదిరింది. అనంతరం రెండు, మూడు దశల్లో క్లినికల్ ట్రయల్న్ నిర్వహించిన రెడ్డీస్ డీసీజీఐకి దరఖాస్తు చేసింది. వాటి ఫలితాల సమాచారాన్ని విశ్లేషించిన నిపుణుల కమిటీ భారత్లో స్పుత్నిక్ – వి టీకా అత్యవసర వినియోగానికి కొద్ది రోజుల క్రితం పచ్చజెండా ఊపింది.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం