Wine Shop Rush : వైన్‌షాపుల ముందు జాతరే..జాతర! బాటిల్ దొరికితే లక్కే!
Wine Shop Rush : మరో కొద్ది గంటల్లో తెలంగాణలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాజధాని నగరంలోని వైన్ షాపులన్నీ రద్దీగా కనిపించాయి. మద్యం ప్రియులు వందల సంఖ్యలో వైన్ షాపుల ఎదుట బారులు తీరారు. కొన్ని చోట్ల గంటల వ్యవధిలోనే మద్యం మొత్తం అమ్ముడు పోయింది. 10 రోజుల పాటు లాక్డౌన్ ఉంటున్న నేపథ్యంలో మద్యం ప్రియులు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు.
Wine Shop Rush : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి లాక్డౌన్ అనే ప్రకటన టివీస్క్రీన్Tv Screen)లపై ఎప్పుడైతే కనిపించిందో మద్యం ప్రియులు, మందు బాబులు వారికి దగ్గరలో ఉన్న వైన్ షాపు(wine shop)ల వద్ద వేగంగా వెళ్ళి క్యూలు కట్టారు. అప్పటి వరకు తాబేలు పాకినట్టు సాగిన వైన్‌షాపుల్లో మద్యం సేల్స్, లాక్డౌన్ ప్రకటన తెలిసిన గంట వ్యవధిలోనే జెట్ స్పీడ్‌గా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులు అయితే గానీ మద్యం సరుకు అమ్ముడు పోని మద్యం షాపుల్లో కేవలం 3 గంటల వ్యవధిలో, షాపుల్లో మద్యం అంతా ఖాళీ అయ్యిందంటే ఎంత మద్యం కొన్నారో అర్థం చేసుకోవచ్చు. అసలే కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో కేసులు పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి అనగా ఈ నెల 12 నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైన్‌షాపుల్లో మద్యం అంతా అమ్ముడుపోయింది. ఈ సందర్భంగా మద్యం ప్రియులు ఎలా మద్యం కొన్నారో, సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీకోసం అదిస్తున్నాం.






