ruby laser principle: స్టీలు కడ్డీని సైతం నిశ్శబ్ధంగా కోయగల సాధనం లేజర్ కిరణం గురించి తెలుసా?
ruby laser principle 20వ శతాబ్ధంలో అద్భుత ఆవిష్కరణలో లేజర్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కిరణాలు అతి ధృఢమైన, దుర్భేద్యమైన వజ్రాల్లో రంధ్రాలు చేస్తాయి. శత్రుదేశాలు ప్రయోగించిన భీకర క్షిపణులను భూమికి చేరకముందే ఆకాశంలోనే తునాతునకలు చేయగలవు. పదునైన కత్తి, వెన్న ముద్దను కోసినంత సులువుగా ధృఢమైన స్టీలు కడ్డీని కూడా నిశ్శబ్ధంగా కోయగల లేజర్ కిరణాల మౌలిక భావనలను డాక్టర్ ఛార్లెస్, హెచ్టౌన్స్ 1954 లో ప్రతిపాదిస్తే, 1960 జూలైలో డాక్టర్ థియోడర్గ్. హెచ్.మైమన్, ఆయన అనుచరులు(ruby laser principle) రూపొందించారు.

రూబీ లేజర్ :దీనిని మొట్టమొదటి లేజర్ రూబీగా చెప్పవచ్చు. అమ్మాయి చిటికెన వేలంత 2.5 సెంటీమీటర్ల పొడవు, పెన్సిలంత మందం కలిగిన ఖనిజ తనుక. రూబీ అల్యూమినియం, ఆక్సిజన్ మూలకాల మిశ్రమం. ఈ ఖనిజంలో శాస్త్రజ్ఞులు క్రోమియం అనే మూలక కణాలను ప్రవేశపెట్టి, క్రోమియం పరమాణువులు రూబీలోని కొన్ని అల్యూమినియం పరమాణువుల స్థానాలను ఆక్రమించేలా చేస్తారు. ఇలా తయారైన రూబీ స్పటికాన్ని ఇరు వైపులా చదును చేసి, ఆ తలాలపై వెండిపూతగా పూస్తారు. ఒక వైపు వెండి పూత రెండో వైపుకన్నా రెట్టింపు మందంగా ఉంటుంది.
లేజర్ కిరణం వెలువడేదిలా..
రూబీ స్పటికంలో పరమాణువులు ఒక క్రమపద్ధతిలో అమరి ఉంటాయి. ఈ పరమాణువుల ప్రవర్తన వాటిపై కాంతి ప్రసరించేంత వరకు మామూలుగా ఉంటుంది. కాని వాయువు నింపిన గాజు గొట్టంలోని కాంతి రూబీ స్పటికంపై పడినప్పుడు దానిలోని పరమాణువులు కాంతిలోని ఫోటాన్లను సంగ్రహించి ఉత్తేజం పొందుతాయి. ఉత్పన్నమైన ఫోటాన్లు రూబీలోని అన్ని దిశలకూ వ్యాపిస్తాయి. రూబీపై ప్రసరించే కాంతిని ఎక్కువ సేపు ఉంచితే విడుదలయ్యే ఫోటాన్ల సంఖ్య ఎక్కువై అవి రూబీ స్పటికంలో అటూఇటూ తిరుగుతూ వెండిపూత తక్కువ మోతాదులో పూసిన రూబీ చివర నుంచి తప్పించుకొని బయట పడతాయి. ఇలా రూబీ వెలువడిన కాంతివంతమైన కిరణమే లేజర్ కిరణం.

లేజర్ నుంచి ప్రసరించే కాంతి తరంగాలు పొందికగా, ఒకే నిర్థిష్ట దిశలో పయనిస్తాయి. మామూలు కాంతిపుంజాల్లా ఎక్కువ వైశాల్యంలో పరుచుకోకుండా లేజర్ కాంతి పుంజాలు ఇరుకైన, పరిమిత మార్గంలో పయనిస్తాయి. దూరం ఎంతైనా లేజర్ కాంతిపుంజం విస్తరించకుండా పయనించడం వల్ల రోదసిలోని అంతరాంతరాల్లో దూసుకుపోయే రాకెట్లు, ఉపగ్రహాలు అవి ఎంత దూరంలో, ఎక్కడ ఉన్నా వాటితో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఈ కిరణాలు ఎంతో దోహం చేస్తాయి. లేజర్ పుంజంలోని ఒక కిరణం టెలివిజన్ ప్రసారాలను, వేల మిలియన్లు గెలిఫోను సంభాషణలను ఒకేసారి తీసుకుపోగలదు.

Light Amplification by Stimulated Emiss of Radiation సంక్షిప్త రూపమే Laser (లేజర్). ఒక మాటలో చెప్పాలంటే ఒక కాంతి జనకం మాత్రమే. కాని దీని కాంతిలో మామూలు సూర్యకాంతి, దీపకాంతిలోలేని కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. లేజర్ కిరణాలు మామూలు కాంతి కిరణాల్లాగా చెల్లాచెదురుగా, పోయేకొలదీ ఎక్కువ వైశాల్యాన్ని ఆక్రమించకుండా, ఒకటిగా, పొందికగా సిద్ధమైన దశలో, ఒకే రంగుతో, తీవ్రమైన తీక్షణతతో, నిర్థిష్టమైన దిశలో పయనిస్తుంటాయి.