RS Praveen kumar: హైదరాబాద్: బహుజన నేత ఆర్.కృష్ణయ్యను బహుజన సమాజ్ వాద్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీసీ హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆర్.కృష్ణయ్య కు ప్రజలలో మంచి గుర్తింపు, పేరు ఉంది.
ఇక తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ, సమ సమాజ నిర్మాణ స్థాపనే ధ్యేయంగా తన ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బిఎస్పీ పార్టీలో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్(RS Praveen kumar) కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో ఇద్దరు బహుజన నేతలు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తెలంగాణలో అధికంగా ఉన్న బహుజనులు (బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రవర్ణ పేదలను) ఏకంగా చేసే పనిలో ఇద్దరు నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంపై రాజకీయ పరంగా సమరానికి సిద్ధమవ్వనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో బహుజన్ సమాజ్ వాద్ పార్టీలోకి ఆర్.కృష్ణయ్యను ఆహ్వానించనున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ప్రొ.కోదండరామ్ రెడ్డిని ఓ పుస్తకావిష్కరణ సభలో కలిసి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు ఆర్.కృష్ణయ్య ను కలవడం పట్ల చర్చలను నడుస్తున్నాయి. భవిష్యత్తులో మరింత మంది బహుజన నాయకులను కలిసే ఆలోచనలో ఆర్.ఎస్ ప్రవీణ్ ఉన్నట్టు తెలుస్తోంది.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?