Neem Tree Plant :Hyderabad: ‘మొక్కలను నాటండి, చెట్లని నరకొద్దు..’అంటూ ప్రభుత్వాలు భారీ కార్యక్రమాలు చేపడతున్నాయి.చెట్లు ఉండటం వల్లే కాస్త స్వేచ్ఛమైన గాలిని మనం అందరం పీల్చుకుంటున్నాం. ఈ ఆధునిక పోకడ వచ్చినప్పటి నుంచి భూ తల్లి పచ్చగా ఉండాల్సింది పోయి, కాంక్రీటు బరువులతో కకా వికలమవుతున్న విషయం చెట్ల ప్రియులు అప్పుడప్పుడు ఉపన్యాసాలలో చెబుతూనే ఉంటారు. ఎవరు చెప్పినా, చెప్పకపోయినా మాత్రం చెట్ల వల్ల మనకు ఉపయోగమే తప్ప ఎలాంటి హానీ లేదు. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల వల్ల చెట్లు రోజురోజుకూ కొన్ని వందల సంఖ్యలో అంతరించి పోతున్నాయి. చెట్ల వల్ల ఉపయోగం తెలిసిన ఓ ఎనిమిదోవ తరగతి విద్యార్థి చేసిన పనికి అందరం నోరెళ్ల పెట్టాల్సిందే. విషయానికి వస్తే..!
హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో ఓ ఇంటి నిర్మాణానికి ఓ భారీ వేప చెట్టు అడ్డు వస్తుందని స్థానికులు ఆ భారీ వేప చెట్టును నరికారు. ఆ చెట్టుకు ఇంచుమించు 40 ఏళ్ల వయసు ఉంటుందట. ఉన్నట్టుండి ఆ భారీ వేప చెట్టును రాత్రికి రాత్రే నరికి వేశారు. ఆ చెట్టు ఆనవాళ్లను కనిపించకుండా తగుల బెట్టే ప్రయత్నం కూడా చేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థి అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్ (1800 425 5364)కు ఫోన్ చేశాడు. తాను గ్రీన్ బ్రిగేడియర్ ను అని పరిచయం చేసుకున్నాడు.
తన ఇంటి సమీపంలో పెద్ద వేప చెట్టును నరికి వేశారని, నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.


విచారణ చేపట్టిన అటవీ శాఖ ఈస్ట్ అధికారులు అనుమతి లేకుండా వేప చెట్టును నరికేశారని నిర్థారించారు. బాధ్యులైన వారికి రూ.62,075 జరిమానా వేసి మరీ వసూలు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదు చేసిన బాలుడుని అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు.
ఇది చదవండి:ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం స్వాధీనం!
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?
ఇది చదవండి:10న నల్గొండకు సీఎం కేసీఆర్
ఇది చదవండి: సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ రవీంద్రబాబు