RRR Ticket | ప్రజల్లో హీరోలపై ఉన్న అభిమానాన్ని ఆసరాగా చేసుకుని గతంలో రూ.200 నుంచి రూ.300 ఉన్న ధర కాస్త ఇప్పుడు అమాంతం నాలుగు అంకెలకు చేరింది. ఇద్దరు పెద్ద హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్‌లతో ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. దీనిపై ప్రజలు, అభిమానుల్లో ఉన్న అంచనాలను ఆసరా చేసుకుని బెనిఫిట్ షో టికెట్ల(RRR Ticket) ధరలను అమాంతం పెంచారని సమాచారం. సినిమా విడుదల రోజున సాధారణ టికెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వరకు బాగానే ఉంది.
ఏపీలో సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ల విషయంలో నియంత్రణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు భారీగా ధరలు పెంచినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు, ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో కొందరు సినిమా టికెట్లను ఇష్టారీతిన విక్రయించనున్నట్టు తెలుస్తోంది. సిండికేట్ అయి ఒక్కో టిక్కెట్టును రూ.1000 విక్రయించాలని నిర్ణయించినట్టు సమాచారం.
రెవెన్యూ అధికారులు థియోటర్ వైపు కన్నెత్తి చూడని వైనం. గతంలో దగ్గరుండి సినిమా టిక్కెట్లు తక్కువ ధరకు అమ్మేలా చూసినా రెవెన్యూ అధికారులు ఇప్పుడు భారీ ధరకు టికెట్లు అమ్ముతున్నా నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా టికెట్ ధరలు చూస్తే!
దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న త్రీడీ ప్లాటినం స్క్రీన్‌లో ఆర్ఆర్ఆర్ ఒక్కో టికెట్ ధర రూ.2,100 గా విక్రయం అవుతోంది. ఈ టికెట్ల ధరలు నేరుగా బుక్‌మై షోలోనే విక్రయమవుతున్నట్టు తెలుస్తోంది. త్రీడీలో ఈ ధర రూ.1,900 ఉండగా, 3డీ స్క్రీన్ రిక్లైనర్ సీట్లకు టికెట్ ధరలు రూ.1,720 గా ఉంది. ముంబైలో, కోల్‌కత్తాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. విశేషమేమిటంటే ఈ ధరలన్నీంటికీ పన్నులు లేకుండానే ఉన్నాయి. జీఎస్టీ కలిపితే ఈ టికెట్ ధరలు మరింత పెరగనున్నాయి.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ