RRR Movie Ticket Rates | దర్శకధీరుడు రాజమౌళీ క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్(RRR) మరో 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తగా థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమా గురించి దేశం మొత్తం ఆసక్తిని కనబరుస్తోంది. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలిసారిగా సర్కీన్ షేర్ చేసుకోనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ప్రస్తుతం జక్కన్న అండ్ టీమ్ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తోంది. నిన్న (సోమవారం) ఈ మూవీ నుంచి ఎత్తర జెండా అనే సెలబ్రేషన్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. తర్వలోనే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను దుబాయ్ వేదికగా గ్రాండ్‌గా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
RRR Movie Ticket Rates
ఇక ఈ సినిమా టికెట్ ధర పెంపుదల విషయమై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను రాజమౌళి, నిర్మాత డివివి దానయ్య కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం టికెట్ ధరను రూ.100 అదనంగా పెంచారట. దీంతో ఈ సినిమాకి బిగ్ రిలీఫ్ దొరికినట్టే. జగన్ ఇంత పాజిటివ్‌గా స్పందించి టికెట్ ధరను పెంచడంతో రాజమౌళి చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకన్న ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి భారీగా రిటర్స్న్ రావాలంటే టికెట్ ధర చాలా కీలకమని తెలిసిందే. అలాగే ఈ సినిమాకు ఏపీలో ఐదవ షోకి కూడా అనుమతి లభించడంతో భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలున్నాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతోంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ