Rose Flowers: గులాబీ పువ్వులో రెక్కలన్నీ రాలిపోయిన తర్వాత మిగిలిపోయిన బొండు భాగాన్ని రోజ్ హిప్స్ అంటారు. వీటిల్లో విటమిన్-సి అత్యధిక మొత్తాల్లో ఉంటుంది. ఆసక్తికరమైన విషయమేమంటే, ప్రతి 100 గ్రాముల రోజ్‌హిప్స్‌లోనూ 150 మి.గ్రా. ఆస్కార్బిక్ యాసిడ్ (Vitamin-C) ఉంటుంది. విటమిన్-సి నిల్వలుగా పేరుగాంచిన కమలాపండ్ల రసంలో ప్రతి 100 మి.లీ రసానికి విటమిన్-సి 50 మిల్లీగ్రాముల మాత్రమే ఉండటం గమనార్హం. అలాగే టమాటాల్లో 20 మిల్లీగ్రాములూ, యాపిల్స్‌లో 5 మిల్లీగ్రాములూ మాత్రమే ఉంటుంది.
రోజ్‌పెటల్స్
గులాబీపువ్వుల ఆకర్షణ పత్రాలను మొగ్గదశలోనే వేరుపరిచి నీడలో అతి కొద్దిసేపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఎండబెట్టి నిల్వ చేస్తారు. వీటిని పాన్‌ఖురి అంటారు. శీతలపానీయాల్లో సువాసనకోసం, చల్లదంన కోసం వాడతారు.
రోజ్‌వాటర్
తాజా గులాబీ(Rose Flowers) పూలెక్కలను నీళ్లలో కలిపి ఆవిరి వచ్చేంత వరకూ మరగించి, నీటి ఆవిరిని మరో పాత్రలో సేకరించి చల్లబరుస్తారు. దీనినే రోజ్‌వాటర్ అంటారు. ఈ ప్రక్రియను శాస్త్రీయ పరిభాషలో డిస్టిలేషన్ మోతాదుకు రెండు పెద్ద చెంచాల చొప్పున వాడతారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. కళ్లకలక వంటి పిత్తవికారాలను తగ్గిస్తుంది.
రోజ్‌వాటర్
ఒక గ్లాస్ నీల్లను మరగించి అందులో రెంటు టేబుల్ స్పూన్ల గులాబీ(Rose Flowers)రెక్కలను (ఎండినవి) 10 చుక్కల అయిలా ఆఫ్ విట్రియాల్‌ని, 4 టీస్పూన్ల పంచదారను కలిపితే రోజ్ టింక్చర్ తయారవుతుంది. దీనికి రోజుకు రెండు, మూడుసార్లు, పూటకు 2-3 టీస్పూన్ల మోతాదులో వాడితే రక్త స్రావాలు, కడుపునొప్పి వంటివి తగ్గుతాయి.
రోజ్ హనీ
తాజా గులావీ పూరెక్కలను నీళ్లలో వేసి చిక్కగా మారేంత వరకూ మరగించి, వడపోసి తేనె కలిపితే రోజ్(Rose Honey)హనీ తయారైనట్టే. దీనిని గొంతునొప్పిలో లోపలకి వాడతారు.
గుల్కంద్
గులాబీ పూరెక్కలను, తేనెను, పంచదారను పొరలుగా పరిచి పదిహేను రోజులవరకూ మాగేస్తే గుల్కండ్ తయారవుతుంది. దీనిని ఎండాకాలం వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి పాలతో కలిపి వాడతారు. అలాగే మహిళ్లలో అధిక బహిష్టుస్రావాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.
గుల్‌రోగన్ తైలం
నల్లనువ్వులను తడిపి, గులాబీ పూరెక్కల ముద్దను పట్టించి నూనెగానుగలో వేసి తైలాన్ని పిండుతారు. దీనిని తలకు రాసుకుంటే జుట్టు సహజమైన సువాసనను వెదజల్లుతుంది. తలనొప్పి, మాడుపోటు వంటివి దూమవుతాయి.
రోజ్‌వెనిగర్
వెనిగార్‌లో గులాబీ పూరెక్కలను వేసి నానబెట్టి పడపోస్తే రోజ్Vinegar తయారవుతుంది. దీనిలో గుడ్డను తడిపి నుదిటిమీద పట్టువేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
రోజ్ మాయిశ్చరైజర్
గులాబీ జలాన్ని (Rose Water) గ్లిజరిన్ ఒక్కో భాగం తీసుకుని, ఒక సీసాలో వేసి బాగా గిలకొడితే చక్కని మాయిశ్చరైజర్ తయారవుతుంది. దీనిని పొడిచర్మానికి రాసుకుంటే చర్మం కుసుమకోమలంగా తయారవుతుంది. వ్యాపార దృక్ఫథంతో తయారుచేసే మార్కెట్ ఉత్పత్తుల కన్నా ఇది ఎన్నోరెట్టు హితకరంగా పనిచేస్తుంది.