rold gold haramవరంగల్: పోలీసు కమిషనరేట్ పరిధిలోని నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ ప్రజల వద్ద నుండి డబ్బును సంపాదిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను ఇంతేజా గంజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఈ ముఠా సభ్యుల నుండి రూ.10 లక్షల 45 వేల నగదుతో పాటు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ బంగారు(fake gold) గుండ్ల హారాలను పోలీసులు స్వాధీనం (rold gold haram)చేసుకున్నారు.
వరంగల్ పోలీసు కమిషనర్ డా.తరుణ్ జోషి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం. అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన మోహనలాల్ (50) (కర్ణాటక) పాత బట్టలను కొనుగోలు చేసి వాటిని కొత్తవాటిగా మార్చి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అమ్మేవారు. ఈ విధంగా నిర్వహించే వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో నిందితుడు మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవాడు. గతేడాది కరోనా కారణంగా బట్టల వ్యాపారం నడవకపోవడంతో పాటు నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన తన బంధువైన మరో నిందితుడు ధర్మ (కర్ణాటక)తో కలిసి బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతామని చెప్పి నకిలీ బంగారాన్ని అందజేసి డబ్బు సంపాదించాలని ప్రణాళికను రూపొందించుకున్నారు.
ఇందులో భాగంగా నిందితులు రెండు కిలోల రోల్డ్ గోల్డ్ బంగారం గుండ్ల హారాన్ని కొనుగోలు చేశారు. గత అక్టోబర్ నెల 23వ తేదీన బెంగళూరు నుండి వరంగల్ చేరుకున్న ఇద్దరు నిందితులు ఏనమామూల మార్కెట్ ప్రాంతంలో పురుగుల మందుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న దుకాణం యజమాన్ని వద్దకు వెళ్లారు. తాము రోడ్డు పనులు చేసేందుకు వచ్చామని, ఇరువురు నిందితులు మారు పేర్లలో పరిచయం చేసుకొని గులాబీ మొక్కలకు అవసరమైన పురుగు మందులను కొనుగోలు చేశారు.


నిందితులు మరుసటి రోజు వచ్చి మేము రోడ్డు మరమ్మత్తులు నిర్వహిస్తుండగా బంగారు గుండ్ల హారం దొరికిందని, మా చెల్లెలు పెళ్లి ఉంది కావున డబ్బు అవసరమని దొరికిన బంగారం తక్కువ ధరకు అమ్ముతామని నమ్మబలికారు. నిజమైన బంగారు గుండును అందజేసి పరీక్షించుకోమని మాయ మాటలతో పురుగులు మందుల షాపు యజమానిని నమ్మించి తమ సెల్ఫోన్ నెంబర్ తెలియజేసి నిందితులు మరుసటి రోజున ఖమ్మం కు వెళ్లారు.
నిందితులు ఇచ్చిన బంగారు గుండు స్వచ్ఛమైన బంగారమని తేలడంతో సదరు వ్యాపారి తక్కువ ధరకు పెద్ద మొత్తంలో బంగారం దొరకుతుందని ఆశపడి సదరు వ్యాపారి అక్టోబర్ 29న తన భార్యతో కలిసి ఖమ్మం పట్టణంలో నిందితులకు రూ.12 లక్షల అందజేశారు. నిందితులు తమ వద్ద ఉన్న 2 కిలోల నకిలీ బంగారం గుండ్ల హారాన్ని వ్యాపారికి అందజేశారు. ఇంటికి వచ్చిన గుండ్ల హారాన్ని స్వర్ణకారుడితో పరీక్షించగా అది నకిలీ బంగారం అని తేలడంతో బాధితుడు తాను మోసపోయానని ఇంతేజా గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనపై సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పోలీసు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను గుర్తించారు. నిందితులు వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకుంటూ మరోమారు ప్రజలను మోసం చేసేందుకు గాను మంగళవారం తిరిగి ఖమ్మం నుండి రైలు ద్వారా వరంగల్ రైల్వే స్టేషన్కు నిందితులు చేరుకున్నట్టు సమాచారం రావడంతో ఇంతేజా గంజ్ ఇన్ స్పెక్టర్ మల్లేష్ తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


వారిని విచారించగా అసలు మోసాన్ని పోలీసుల ఎదుట అంగీకరించడంతో పాటు, నిందితుల నుండి రూ.10 లక్షల 45 వేల డబ్బు, ఐదు సెల్ఫోన్లు, నకిలీ బంగారు హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపర్చిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి, ఇంతేజార్ గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేష్, సబ్ ఇన్ స్పెక్టర్ శ్రవణ్, ఏఏఓ సల్మాన్పషా, హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు, కానిస్టేబుళ్లు సంతోష్, శివకృష్ణ, అలీ, నరేష్, సర్దార్ రాంరెడ్డి, హోంగార్డు ఐలయ్యలను పోలీసు కమిషనర్ అభినందించారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!