Rod Marsh dies: ఆస్ట్రేలియా క్రికెట్ లెజండ‌రీ రాడ్ మార్ష్ మృతి

Rod Marsh dies | 1970 నుండి 1984 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆస్ట్రేలియా త‌ర‌పున 96 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రాడ్ మార్ష్ (Rod Marsh dies)ఆడిలైడ్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచిన‌ట్టు స్పోర్ట్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ శుక్ర‌వారం ధృవీక‌రిచింది. రాడ్ మార్ష్ అద్భుత‌మైన వికెట్ కీప‌ర్‌. ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ టీం త‌ర‌పున ఆడి ఎన్నో విజ‌యాల్లో పాలు పంచుకున్నారు. 74 సంవ‌త్స‌రాల రాడ్ మార్ష్ కు క్వీన్స్ లాండ్ రాష్ట్రంలో నిధుల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో గుండెపోటు వ‌చ్చింది. వారం త‌ర్వాత ఆసుప‌త్రిలో మృతి చెందారు.

1970 నుంచి 1984 వ‌ర‌కు ఆస్ట్రేలియా త‌ర‌పున 96 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. మార్ష్ వికెట్ కీప‌ర్‌గా 355 ఔట్లు చేశారు. లిల్లీ బౌలింగ్‌లో 95 ప‌రుగులు కూడా చేశారు. 1984 సంవ‌త్స‌రంలో టాప్ ఫ్లైట్ క్రికెట్ నుండి రిటైర్డ్ అయ్యారు. రాడ్ ఎడ‌వ చేతి వాటం బ్యాట‌ర్‌గా పేరు ఉంది. అత‌ను టెస్ట్ క్రికెట్‌లో సెంచ‌రీ చేసిన మొద‌టి ఆస్ల్రేలియ‌న్ వికెట్ కీప‌ర్‌గా చ‌రిత్ర‌లో రికార్డు సృష్టించారు.

అనంత‌రం ఆస్ట్రేలియా మ‌రియు ఇంగ్లాండ్‌లోని జాతీయ క్రెకెట్ అకాడ‌మీల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. దుబాయ్‌లోని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్ర‌పంచ కోచింగ్ అకాడ‌మీకి అధిపతిగా ఉన్నారు. రాడ్ మార్ష్ మృతి ప‌ట్ల ఆస్ట్రేలియ‌న్ లెజండ‌రీ లెగ్ స్పిన్న‌ర్ షేన్ వార్న్ సోష‌ల్ మీడియాలో నివాళ్ల‌ర్పించారు. రాడ్ మార్ష్ మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని, గొప్ప ఆట గాడ‌ని ఈ వార్త త‌న‌ను బాధించింద‌ని విచారం వ్య‌క్తం చేశారు.

Share link

Leave a Comment