rock salt health benefitsఉప్పును కూర రుచి ఉండటానికి అందరూ వాడే సర్వసాధారణ నిత్యవసర పదార్థం. ఈ ఉప్పు లేని ఇల్లు ఉండదు. ఊరు అంతకంటే ఉండకపోవచ్చు. ఉప్పు రుచిగే కాదు ఒక ఔషధంలా, చికిత్సకు ఒక మందులా ఉపయోగపడే చీప్ అండ్ బెస్ట్ పదార్థం. ఉప్పులో సకల ఆయర్వేద రహస్యాలు దాగి ఉన్నాయి. అసలు దీనిని ఏ విధంగా ఉపయోగించవచ్చో ఎన్ని రకాలుగా ఉప్పు మనకు ఉపయోగపడుతుందో ఇప్పుడు(rock salt health benefits) తెలుసుకుందాం!
సాధారణ పాముకాటు: బురద పాము లేదా తుట్టె పురుగు లేదా మామూలు పాములు కరిచినప్ఉడు, కరిచిన చోట కత్తితో కొద్దిగా గీరి రక్తము పిండి ఉప్పు, సున్నము కలిపి నూరిన ముద్దను కాటుపై మర్దించిన యెడల విషయం దిగుతుందట.

కలరా వ్యాధి: ఉప్పు, మిరియాలు, జిల్లేడు పూవ్వులు సమభాగాలు తీసుకుని కలిపి మెత్తగా నూరి బఠాని గింజలంత టాబ్లెట్స్ చేసి గంటకు ఒక టాబ్లెట్ చొప్పున 5,6 మాత్రలు వేసుకుంటే కలరా హరించిపోతుంది.
దెబ్బల వాపులకు: ఉప్పు, వెల్లుల్లి పాయలు సమభాగాలుగా తీసుకుని మెత్తగా దంచి ఆ ముద్దను వాపు మీద వేసి కడుతూ ఉంటే 2 కట్లు లోనే వాపు తగ్గిపోతుంది.
అధిక పైత్యమునకు: ఉప్పు, చింతపండు, మిరియాలు, శీకాయ చెట్టు చిగురాకులు కలిపి పచ్చడిలాగా నూరి, ఆ పచ్చడిని అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే అధికపైత్యం హరించిపోతుంది.
ఆకలి- అజీర్ణం: ఉప్పు, శొంఠి సమభాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకుని భోజన సమయంలో మొదటి ముద్దలో 5 గ్రాం పొడి కలిపి తింటూ ఉంటే నాలుక, గొంతు శుభ్రమై కఫము తగ్గి , ఆకలి పెరిగి, ఆహారం భాగా జీర్ణం అవుతుంది.
కడుపు నొప్పి: ఒక గ్లాస్ నీళ్లల్లో 1 స్పూన్ సోడా ఉప్పు కలిపి తాగితే మంత్రించినట్టుగా కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది.
చలి జ్వరం: ఉప్పు, మిరియాలు, పిప్పింటాకు ఈ మూడు సమంగా కలిపి కచ్చాపచ్చాగా నలగగొట్టి గుడ్డలో
వేసి మూటగట్టి దాని వాసన పదే పదే చూస్తు ఉంటే చలి జ్వరం రాకుండా ఉంటుంది.
చిన్న పిల్లల కడుపు నొప్పి: నల్ల ఉప్పు 10గ్రాం నిప్పుల మీద వేసి పొంగించిన వెలి గారము. 5 గ్రాం ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి 2 పూటల పూటకు చిటికెడు మోతాదుగా నీటిలో కలిపి తాగిస్తూ ఉంటే పిల్లల కడుపు నొప్పి తగ్గుతుంది.

తల నొప్పులకు: తినే ఉప్పు, పాతిక గ్రాం బెల్లం ఈ రెండూ సమంగా కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని 2 పూటల 2 గ్రాం పొడిని గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగుతూ వుంటే తలనొప్పులు తగ్గిపోతాయి.
పిల్లల ఉదర వ్యాధులు: నల్ల ఉప్పు, సోంపు గింజలు సమంగా తీసుకుని మెత్తగా దంచి నిలువ చేసుకుని, రోజూ 2 పూటలా ఒక గ్రాము పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగిస్తూ ఉంటూ పిల్లల ఉదర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.
స్త్రీల హిస్టీరియా: నల్ల ఉప్పు 10 గ్రాం, తినే ఉప్పు 10 గ్రాం, ఇంగువ 3 గ్రాం, సైంధవ లవణం 10 గ్రాం, నూరే కారం 10 గ్రాం, పిప్పళ్లు 10 గ్రాం, శొంఠి 10 గ్రాం, ఆవాలు 10 గ్రాం, ఇవన్నీ కలిపి చూర్ణం చేసి కొద్దిగా నిమ్మపండ్ల రసంతో మర్దించి నిలువ చేసుకోవాలి. రోజూ 2 పూటలా 3 గ్రాం మోతాదుగా వేడి నీళ్ళతో సేవిస్తూ ఉంటే స్త్రీల హిస్టీరియా నశించి పోతుంది.
చెవిలో పురుగు దూరితే: చెవిలో పురుగు దూరితే ఉప్పు, వేపాకు కలిపి దంచిన రసము 4 చుక్కలు చెవిలో వేస్తే వెంటనే క్షణాలలో పురుగు బయటకు వస్తుంది.
ఫిట్స్ వచ్చినప్పుడు: ఉప్పును నీటిలో వేసి కరిగించి వడపోసి ఆ ఉప్పు నీటిని 3, 4 చుక్కలు ముక్కులో వేస్తే ఫిట్స్ వల్ల, అపస్మారము వల్ల తెలివి తప్పిన వారు వెంటనే కోలుకుంటారు.
వాపులకు- నొప్పులకు: ఉప్పును వేయించి మూటగట్టి దానితో కాపడం పెడుతూ ఉంటే వాపులు, నొప్పులు వెంటనే తగ్గుతాయి. కడుపు నొప్పికి, గుండె నొప్పికి ఇదే విధంగా కాపడం పెట్టడం ద్వారా నొప్పులు తగ్గుతాయి.
మరికొన్ని ఉపయోగాలు..
-ఉప్పును ఇంట్లోని తలుపులు, కిటికీలు, షెల్ఫ్ వంటి ప్రదేశాల్లో చల్లండి. దీంతో చీమలు రావు. ఇలా చేయడం వల్ల ఇంట్లో తేమ వాతావరణం కూడా పొడిగా మారుతుంది.
-ఉప్పు, యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని కలపాలి. ఈ మిశ్రమంలో రాగి, వెండి, ఇత్తడి పాత్రలు తోమితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.

-లీటరు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి మరిగించాలి. ఈ నీటితో కిటికీలు, తలుపులు, అద్దాల కిటికీలు, కారు అద్దాలు తుడుచుకోవచ్చు. ఈ నీటితో కిచెన్ సింక్ కూడా శుభ్రం చేసుకోవచ్చు.
-ఉప్పు, లవంగనూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. కాసేపటి తర్వాత స్నానం చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది.
-కొన్ని నీళ్లలో ఉప్పు వేసి, ఆ నీటిలో గుడ్డ ముక్క ముంచాలి. దీంతో కార్పెంట్లు, దుప్పట్లు, దుస్తులపై పడ్డ మరకలు తుడిస్తే ఇట్టే తొలగిపోతాయి.
-ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో…కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలుంచాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివ పోతాయి.
-బేకింగ్ సోడా, ఉప్పు, నీరు కలిపిన మిశ్రమంతో పళ్లు తోముకుంటే పళ్ళు మిలమిలా మెరుస్తాయి.
-దుస్తులు, డిటర్జెంట్ లేదా సబ్బుతో ఉతికిన తర్వాత నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నీటిలో దుస్తులను ముంచి తీయాలి. దీంతో దుస్తులు షింక్ అవ్వవు. దీనికి తోడు బట్టలు శుభ్రంగా, మృదువుగా మారతాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి