road accidents | చిత్తూరు-అన్నమయ్య జిల్లాల్లో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురి గాయపడగా ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఆగివున్న లారీని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు, లారీ కిందకు దూసుకెళ్లి ఒక విద్యార్థిని మృతి చెందారు.
road accidents: ఆగివున్న Larryని ఢీకొన్న Car
ఆగివున్న లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురి గాయాలు అయ్యాయి. చిత్తూరు జిల్లా నాయుడుపేట- పూతలపట్టు ప్రధాన రహదారిలోని టి.రంగంపేట క్రాస్ రోడ్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుండి బెంగళూరుకి వెళుతున్న కారు ఆగివున్న లారీని ఢీ కొట్టింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో రామచంద్రపురం మండలం దుర్గ సముద్రంకు చెందిన వరలక్ష్మి మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని కోదండరామిరెడ్డి, సుబ్రమణ్యంలతో పాటు మరో నలుగురిని Chittoor ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
road accidents | లారీ కింద పడి విద్యార్థిని మృతి
సిమెంట్ లారీని అధిగమించిబోయి ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందింది. ఈ ఘటన Annamayya District మదనపల్లి-కదిరి ప్రధాన రహదారిలోని అమ్మ చెరువు మిట్ట వద్ద చోటు చేసుంది. బి.కొత్తకోటకు చెందిన చిన్నరెడ్డప్ప భాగ్యమ్మల కుమార్తె శిరీష(17) ద్విచక్రవాహనం వెనుక కూర్చోంది. లారీ కిందకు దూసుకుపోవడంతో శిరీష అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదం చోటు చేసుకోవడంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


లారీ దగ్ధం-ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు!
చంద్రగిరి మండలం, Bhakarapeta Ghat Roadలో గురువాం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ దగ్ధమైంది. పీలేరు నుండి తిరుపతి వైపుకు పొట్టులోడుతో వస్తున్న లారీ తిరుపతి నుండి భాకారాపేటకు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ ఆపకుండా లారీని ఆపకుండా నడపడం వల్ల, లారీకి తగులుకున్న ఉన్న ద్విచక్రవాహనం ఈడ్చకుంటూ పోవడంతో రోడ్డు రాపిడికి మంటలు చెలరేగాయి. మంటలను గమనించని లారీ డ్రైవర్ రోడ్డు ప్రక్కకు లారీని ఆపి పరారయ్యాడు. ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్థమైంది.