Road Accident in Tiruvuru | కృష్ణా జిల్లా తిరువూరు శివారులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువూరు- విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై అర్థరాత్రి ఓ లారిని వెనుక నుంచి బొలేరో వాహనం ఢీ కంది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరికొంత మందికి చిన్న పాటి గాయాలు (Road Accident in Tiruvuru)అయ్యాయి.
క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం నలుగురిని విజయవాడ తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. బొలెరో వాహనంలో తమిళనాడు నుండి ఒరిస్సా కు ఈ 14 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన సమయంలో ప్రయాణికులకు పోలీసులు సహాయ సహకారాలు అందించారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో పాటు ఆహారం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ