Road Accident

Road Accident : కూలి ప‌నుల‌కు వెళుతూ మృత్యువాత‌! పులివెందులలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Road Accident : క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో బుధ‌వారం విషాదం చోటుచేసుకుంది. తెల్ల‌వారుజామున కూలిప‌నులు చేసుకునేందుకు బ‌య‌లు దేరిన రైతు కూలీల‌ను మృత్యువు రోడ్డు ప్ర‌మాదంలో క‌బ‌ళించింది. క‌డ‌ప జిల్లా పులివెందుల మండ‌లం కొత్త‌ప‌ల్లికి చెందిన రైతు మ‌హిళా కూలీలు ముద్ద‌నూరుకు జీపులో బ‌య‌లుదేరారు. స‌రిగ్గా పులివెందుల‌లోని ముద‌నూరు రోడ్డులో ఎంవిఐ కార్యాల‌యం వ‌ద్ద‌కు చేరుకోగానే ఎదురుగా వ‌స్తున్న కారు జీపును ఢీకొట్టింది. ప‌క్క‌నే మున్సిపాలిటీ ట్రాక్ట‌ర్ కూడా ఉండ‌టంతో దాన్ని కూడా ఢీ కొట్టింది.

ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌హిళా రైతు కూలీలు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మ‌రో ఆరుగురుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని పులివెందుల ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో క‌డ‌ప రిమ్స్‌కు త‌ర‌లించారు.

పారిశుధ్య ప‌నులు చేయ‌డానికి వెళుతున్న కార్మికుల‌కు, కూలీ ప‌నుల‌కు వెళ్తున్న మ‌హిళా రైతు కూలీల‌కు రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఆ కుటుంబాలు తీవ్ర మ‌నోవేద‌కు గుర‌వుతున్నాయి. ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసులు చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *