Road accident in Chittoor: బస్సును ఢీకొట్టిన ద్విచక్ర వాహనంChittoor: ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం చెరకువారిపల్లి పంచాయతీ పరిధిలోని జోగివారిపల్లి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
సదుం ఎస్ఐ ధరణీదర తెలిపిన వివరాలు ప్రకారం తిరుపతిలో రంగంపేటకు చెందిన చలపతి ఈశ్వర్ రెడ్డి (23), సదుం మండలం జోగివారిపల్లి కి చెందిన రంజిత్ కుమార్ రెడ్డి (21), గుణ భూషణ్ రెడ్డి (23) ముగ్గురు కలిసి జోగివారిపల్లి ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. అదే సమయంలో పాల వ్యానును క్రాస్ చేయాలనే ప్రయత్నంలో నాయనపాకల నుండి వస్తున్న పీలేరు డిపోకు చెందిన ఎపిఎస్ఆర్టిసి ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని హుటాహుటిన సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈశ్వర్ రెడ్డి మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సదుం ఎస్ఐ ధరణిదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పేర్కొన్నారు.


ఇది చదవండి: వ్యాక్సినేషన్ వద్ద బీజేపీ నేతల ఆందోళన