Road Accident, Chinthakommadinne,

Road Accident in Chinthakommadinne: ఇంటిముందు కూర్చున్న వారిపై దూసుకొచ్చిన వాహ‌నం న‌లుగురి మృతి

Andhra Pradesh

Road Accident in Chinthakommadinne | క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. జిల్లాలోని చింత‌కొమ్మ‌దిన్నె(Chinthakommadinne) మండ‌లంలోని మ‌ద్దిమ‌డుగు(Maddimadugu) స‌మీపంలో బుధ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. ఇంటి ముందు కూర్చున్న వారిపైకి అతి వేగంగా ఓ వాహ‌నం దూసుకొచ్చింది. ఈ ప్ర‌మాదం(Road Accident)లో న‌లుగురు మృతి చెంద‌గా, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు అబ్బులు, కొండ‌య్య‌, దేవి, ల‌క్ష్మీదేవిగా గుర్తించారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ది నేష‌న‌ల్ హైవే రోడ్డు వాహ‌నంగా గుర్తించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చింత‌కొమ్మ దిన్నె పోలీసులు చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను కడ‌ప రిమ్స్‌కు త‌ర‌లించారు.

Road Accident, Chinthakommadinne,
ప్ర‌మాదానికి కార‌ణ‌మైన వాహ‌నం
Road Accident, Chinthakommadinne,
మృతి చెందిన మ‌హిళ‌, పోలీసు విచార‌ణ‌
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *