Garikapadu Check Post

Garikapadu Check Post: గ‌రిక‌పాడు చెక్‌పోస్టు స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Andhra Pradesh
Share link

Garikapadu Check Post: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు చెక్‌పోస్టు స‌మీపంలో బుధ‌వారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.


Garikapadu Check Post: జ‌గ్గ‌య్య‌పేట‌: జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం ఆంధ్రా – తెలంగాణ స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన గ‌రిక‌పాడు చెక్‌పోస్టు(Garikapadu Check Post) స‌మీపంలో కోదాడ నుండి జ‌గ్గ‌య్య‌పేట ర‌హ‌దారిలో ముగ్గురు యువ‌కులు ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌స్తున్నారు. ఈ స‌మ‌యంలో వ‌ర్షం వ‌స్తుండ‌టంతో వారు ప్ర‌యాణిస్తున్న ద్విచ‌క్ర వాహ‌నం ప్రమాదానికి గుర‌య్యింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచారు. మ‌రో వ్య‌క్తికి తీవ్ర గాయాలు కావ‌డంతో అత‌న్ని అంబులెన్స్ స‌హాయంతో వైద్య‌శాల‌కు త‌ర‌లించారు. ఎడతెర‌ప లేకుండా కురుస్తున్న వ‌ర్షంలో ర‌హ‌దారిపై ఎవ‌రూ ప్ర‌యాణం చేయ‌క‌పోవ‌డంతో రాత్రి వేళ‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాదాన్ని ఎవ్వ‌రూ చూడ‌లేక‌పోయారు.

వేగంగా స్పందించిన జ‌గ్గ‌య్య‌పేట సీఐ, చిల్ల‌క‌ల్లు ఎస్సై!

మృత‌దేహాల‌ను త‌ర‌లిస్తున్న పోలీసు సిబ్బంది

ర‌హ‌దారిపై ప్ర‌మాదం జ‌రిగిన విష‌యాన్ని తెలుసుకున్న జ‌గ్గ‌య్య‌పేట సీఐ చంద్ర‌శేఖ‌ర్‌, చిల్ల‌క‌ల్లు ఎస్సై దుర్గా ప్ర‌సాద్ త‌మ సిబ్బందితో ఘ‌ట‌నా స్థ‌లానికి త్వ‌ర‌గా చేరుకున్నారు. వ‌ర్షం ప‌డుతున్న కార‌ణంగా మృత‌దేహాల‌ను తీసేవారు లేక‌పోవ‌డంతో పోలీస్ సిబ్బంది అంతా క‌లిసి మృత‌దేహాల‌ను ఒక వాహ‌నం స‌హాయంతో ప్ర‌మాద స్థ‌లం నుండి జ‌గ‌య్య‌పేట మార్చురీకి త‌ర‌లించారు. చ‌నిపోయిన వారి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.

See also  Krishna Covid-19 : జిల్లా అంత‌ట‌ మ‌రింత‌ అప్ర‌మ‌త్తంగా ఉన్నాం!

Leave a Reply

Your email address will not be published.