RK Selvamani arrest warrant | ఏపీ మంత్రుల క్యాబినేట్ రెడీ అవుతున్న వేళ నగరి ఎమ్మెల్యే రోజా(Roja)కు ఇబ్బంది కలిగించే వార్త ఎదురయ్యింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ప్రముఖ దర్శకుడు, దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు, నగరి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమనిపై చెన్నైజార్జిటౌన్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2016 సంవత్సరంలోని సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ TV ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఫైనాన్షియర్ ముకుంద్‌చంద్ బోద్రా గురించి పలు అభిప్రాయాలు వెల్లడించారు.
RK Selvamani arrest warrant
దీంతో బోద్రా వారిద్దరిపై జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. బోద్రా మృతి చెందాక, కేసును అతని కుమారుడు గగన్ బోద్రా కొనసాగిస్తున్నారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా, సెల్వమణి, అరుళ్ అన్బరసులు కోర్టుకు హాజరు కాలేదు. వారి తరపున న్యాయవాదులు రాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేస్తూ విచారణను 23కు వాయిదా వేశారు.
ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజాకు, రోజా భర్త ఆర్కే సెల్వమణికి కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సెల్వమణికి ప్రస్తుతం అరెస్టు వారెంట్ జారీ అవ్వడంతో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ కేసు విషయంలో సెల్వమణి మంగళవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టు ముందు హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాదులు సైతం రాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ