Ritika Phogat Suicide : Haryana : భారత దేశ ప్రముఖ రెజ్లర్లు గీతా ఫోగాట్ , బబితా ఫోగాట్ కజిన్ సిస్టర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దురదృష్టకర ఘటన యావత్తు ప్రపంచ రెజ్లింగ్ అభిమానులను, క్రీడాకారులను కలిచివేసింది. భరత్‌పూర్‌లో బుధవారం జరిగిన ఓ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో ఓడిపోయానన్న బాధతో తీవ్ర మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. రితికా ఫోగాట్ వయస్సు 17 సంవత్సరాలు, రెజ్లింగ్‌లో ఫోగాట్ కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా మంచిపేరు ఉంది. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆమె రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ టోర్నీల్లో ఆడుతోంది. ఫైనల్లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయానన్న బాధలో ఆమె తన ప్రాణం తీసుకున్నది. ద్రోణాచార్య అవార్డు విన్నర్ అయిన ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగాట్ దగ్గర ఆమె శిక్షణ పొందింది. గత ఐదేళ్లుగా మహావీర్ ఫోగాట్ స్పోర్ట్స్ అకాడమీలో ఆమె శిక్షణ తీసుకుంటోంది. రితికా ఆత్మహత్య పై విచారణ జరుపుతున్నట్టు హర్యానా రాష్ట్రం చర్ఖి దాద్రి జిల్లా ఎస్పీ రామ్‌సింగ్ బిష్ణోయ్ ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాచ్‌లో ఓడిపోవడం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. హర్యానా మంత్రి విజయ్‌కుమార్ సింగ్ తన ట్విట్టర్ ద్వారా ఈ వార్తను విడుదల చేశారు. మహావీర్ ఫోగాట్ కు ఇద్దరు కూతుళ్లు గీతా, బబితా ఫోగాట్ లపై 2016లో బాలీవుడ్లో దంగల్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.
ఉరేసుకొని ఆత్మహత్య..!
రితికా ఫోగాట్ ఫైనల్ మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైంది. భరత్ పూర్ నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజే తన సొంత గ్రామమైన బాలాలిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి ఆస్పత్రిలో పంచానామా నిర్వహించి, డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తోన్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Online class : చెట్టు కింద చదువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచనకు జేజేలు!
- Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!
- Myanmar Capital : ఆ రాజధానిని దెయ్యాల నగరంగా ఎందుకు పిలుస్తారు?
- khammam Municipal Election 2021: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రచారానికి రెఢీ!
- Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!