Rich Dad Poor Dad : డ‌బ్బు కోసం ప‌నిచేయ‌కు..ఆ డ‌బ్బు నీకోసం ప‌నిచేసేలా మార్చుకో!(రిచ్ డాడ్ పూర్ డాడ్) మోటివేష‌న్ స్టోరీ!

0
132

Rich Dad Poor Dad : డ‌బ్బు కోసం ప‌నిచేయ‌కు..ఆ డ‌బ్బు నీకోసం ప‌నిచేసేలా మార్చుకో!(రిచ్ డాడ్ పూర్ డాడ్) మోటివేష‌న్ స్టోరీ!

Rich Dad Poor Dad : రాబ‌ర్ట్ కియోస‌కి ఇద్ద‌రు తండ్రులు ఉన్నారు. ఆ ఇద్ద‌రి తండ్రుల్లో ఒక‌రు పేద‌వారు, ఒక‌రు ధ‌‌న‌వంతులు. ఒకాయ‌న పెద్ద చ‌దువులు చ‌దివి తెలివితేట‌లు సంపాదించుకున్నాడు. ఆయ‌న నాలుగు సంవ‌త్స‌రాల్లో పూర్తి చేయాల్సిన గ్రాడ్యూయేట్‌ను రెండేళ్ల‌లో పూర్తి చేశాడు. ధ‌న‌వంతుడైన రెండో తండ్రి కేవ‌లం 8వ త‌ర‌గ‌తి కూడా గ‌ట్టు ఎక్క‌లేక‌పోయాడు. ఇద్ద‌రూ వారి వారి వృత్తుల్లో చాలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చారు. అందులో ఒక‌రు మాత్రం జీవితాంతం డ‌బ్బు కోసం చాలా ఇబ్బందులు ప‌డ్డాడు. మ‌రొకాయ‌న హ‌వాయిలోని అత్యంత ధ‌న‌వంతుల్లో ఒక‌రుగా ఉన్నారు.

ఇద్ద‌రిలో ఒక‌రు సంపాదించిన డ‌బ్బును కుటుంబ స‌భ్యుల‌కు, చ‌ర్చీల‌కు, సేవా కార్య‌క్ర‌మాల‌కు డాల‌ర్లు, క‌రెన్సీ రూపంలో ఇచ్చి చ‌నిపోయాడు. మ‌రొక‌రు మాత్రం తాను జీవితంలో చేసిన అప్పుల‌ను కూడా తీర్చ లేక‌పోయాడు. వాస్త‌వానికి ఇద్ద‌రూ చాలా ఘ‌టికులే. ఎదుట వారిని ఆక‌ర్షించే మంచిత‌నం వారిలో ఉంది. ఇద్ద‌రూ చ‌దువుపై మ‌క్కువ చూపిన‌వారే. కానీ వారికి చ‌దువు గురించి చెప్పిన ప‌ద్ధ‌తుల్లో మాత్రం చాలా తేడా ఉండేది.

అలాగ‌ని రిచ్ డాడ్ ముందునుండే ధ‌న‌వంతుడు కాదు. పూర్ డాడ్ కూడా మొద‌టి నుంచే పేద‌వాడు కాదు. వారి వృత్తుల్లో క‌ష్ట‌ప‌డ్డారు. కానీ డ‌బ్బు విష‌యంలో మాత్రం ఇద్ద‌రి అభిప్రాయాలు వేరుగా ఉండేవి. ఇద్ద‌రిలో ఒక‌రు ఇలా అనేవారు డ‌బ్బు పాపిష్టిది. ధ‌న‌దాహ‌మే అన్ని అరిష్టాల‌కు మూలం. ఇంకొరు మాత్రం డ‌బ్బు లేక‌పోవ‌డ‌మే అన్ని అరిష్టాల‌కు మూలం అని చెప్పేవాడు.

నిజానికి ధ‌న‌వంతులు ధ‌న‌వంతులు కావ‌డానికి, పేద‌వారు ఇంకా పేద‌వారు కావ‌డానికి డ‌బ్బు సంపాద‌న ఎలానో తెలియ‌క‌పోవ‌డ‌మే?. నిజానికి డ‌బ్బు సంపాదించ‌డం అనేది స్కూళ్లో చెప్ప‌రు. అది మ‌న త‌ల్లిదండ్రులు చెబితేనే తెలుస్తుంది. ముఖ్యంగా ధ‌న‌వంతుల త‌ల్లిదండ్రులు వారి పిల్ల‌ల‌కు అన్ని విష‌యాల‌ను చెబుతారు. డ‌బ్బు ఎలా సంపాదించాలి? సంపాదించిన దానిని ఎలా పొదుపు చేయాలి? అనేవి వారి పిల్ల‌ల‌తో చ‌ర్చిచిస్తారు. కానీ పేద త‌ల్లిదండ్రులు మాత్రం వారి పిల్ల‌ల‌కు ఏం చెబుతారు. కేవ‌లం రోజూ స్కూలుకు వెళ్లి బాగా చ‌దువుకో.. అని చెబుతారు.

పిల్ల‌ల‌కు స్కూల్లో కానీ, కాలేజీలో కానీ డ‌బ్బు గురించి ఎటువంటి విష‌యాలు చెప్ప‌రు. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఎంత మంచి మార్కుల‌తో ఫాసైనా, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా జీవితాంతం డ‌బ్బు గురించి మ‌నం బాధ‌ప‌డుతూనే ఉంటాం. ఈ పుస్త‌కం ర‌చ‌యిత‌కు ఇద్ద‌రు తండ్రులు ఉండ‌టం వ‌ల్ల ప్ర‌తి సారి రెండు విష‌యాల‌ను తెలుసుకున్నాడు. ఇద్ద‌రి తండ్రుల్లో ఒక‌రు నేను కొన‌లేను అంటే, ఇంకొక‌త‌ను నేను దానిని కొన‌గ‌ల‌ను అనేవారు. ఎప్పుడైతే మ‌నం కొన‌లేము అని అవ‌గాహ‌న‌కొస్తామో అప్పుడే మ‌న బుర్ర ప‌నిచేయ‌డం మానేస్తుంది. కానీ ఎలా దానికి కొనాలి? అనే ప్ర‌శ్న వేసుకుంటో ఎలాగైనా దానిని సాధించాల‌నే త‌ప‌న మెద‌డులో మొద‌ల‌వుతుంది. అంటే దీని ఉద్ధేశ్యం ఏదైనా కొనాలి అనేది కాదు. ఎలా? అనే ప్ర‌శ్నం మ‌నలో మొద‌లైతే ఏ ప‌ని అయిన సాధ్య‌మ‌వుతుంద‌ని దీని సారంశం.

ఈ స్టోరీలో ఇద్ద‌రు తండ్రులు ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన‌ప్ప‌టికీ వారిలో ఒకాయ‌న డ‌బ్బు విష‌యంలో త‌న మెద‌డును ఉప‌యోగించుకోలేక‌పోయాడు. రెండో అత‌ను డ‌బ్బు సంపాదించేందుకు మంచి ఆలోచ‌న‌ల కోసం మెద‌డును ఎప్ప‌టిక‌ప్పుడు త‌ట్టి నిద్ర‌లేపేవాడు. దీని ఫ‌లితంగా ఆర్థికంగా ఒకాయ‌న బాగుప‌డితే, రెండో అత‌ను కృంగిపోయేవాడు. రోజూ వ్యాయ‌మం చేసే వ్య‌క్తి కి, ఎటువంటి వ్యాయామం లేకుండా టివి ముందు కూర్చుని కాలం గ‌డిపే వ్య‌క్తి మ‌ధ్య ఉన్న తేడాయే మెద‌డు విష‌యంలో కూడా ఉంటుంది. శారీర‌కంగా చేసే వ్యాయామం మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మెద‌డుకు క‌లిగంచే వ్యాయామం మ‌న‌ల్ని ఎలా ఆలోచించాలో తెలియ‌జేస్తుంది.

Latest Post  Monday thoughts: దేనికైతే నువ్వు భ‌య‌ప‌డి వెనుక‌డుగు వేస్తావో..! తెలుగు కొటేష‌న్లు!

ఒక‌త‌ను క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటే మంచి జాబ్ వ‌స్తుందని అనుకుంటే, రెండో అత‌ను క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటేనే ఏదైనా మంచికంపెనీని నువ్వు కొన‌గ‌ల అవ‌కాశం వ‌స్తుంద‌ని అంటాడు. ఒక‌త‌ను వారి పిల్ల‌ల‌కు భోజ‌నం చేసేట‌ప్పుడు డ‌బ్బు గురించి, వ్యాపారం గురించి చెబితే, రెండో అత‌ను త‌న పిల్ల‌ల‌తో తినేట‌ప్పుడు డ‌బ్బు గురించి మాట్లాడ‌కూడ‌దని అంటాడు. పూర్ డాడ్..నేను ఎప్ప‌టికీ ధ‌న‌వంతుడుని కాలేన‌ని అంటుండేవాడు. అందుక‌నే ఆయ‌న ధ‌న‌వంతుడు కాలేక‌పోయాడు. మ‌రో ప‌క్క రిచ్ డాడ్ ఎప్పుడూ నేను ధ‌న‌వంతుడునే అని అనేవాడు. త‌న వ్యాపారంలో న‌ష్టం జరిగి డ‌బ్బు అంతా పోయినా, త‌ను మాత్రం ఎప్పుడూ ధ‌న‌వంతుడ‌నే అనేవాడు.

నిజానికి అంద‌రూ వారి ఆలోచ‌న‌ల్న‌తోనే వారి జీవితాల‌ను రూపుదిద్దుకుంటారు. ఈ స్టోరీలో ఇద్ద‌రికి చ‌ద‌వు అంటే చాలా గౌర‌వం. కానీ పూర్ డాడీ మాత్రం త‌న కొడుకైన రాబ‌ర్ట్‌ను .. బాగా చ‌దువుకో..బాగా సంపాదించు. అప్పుడే సంతోషంగా ఉండ‌గ‌ల‌వు. అని చెబుతుండేవాడు. రిచ్ డాడ్ మాత్రం డ‌బ్బు సంపాదించ‌డానికి ప‌నికి వ‌చ్చే చ‌దువు మాత్ర‌మే చ‌దువు అని చెబుతుండేవాడు. డ‌బ్బు ఎలా ప‌నిచేస్తుందో ముందుగా తెలుసుకోవాలి. డ‌బ్బు కోసం మ‌నం ప‌నిచేయ‌కూడ‌దు. డ‌బ్బే మ‌న కోసం ప‌నిచేయాలి అని అంటాడు రిచ్ డాడ్‌.

9 ఏళ్ల వ‌య‌స్సులోనే ర‌చ‌యిత రాబ‌ర్ట్ రిచ్‌డాడ్‌, పూర్ డాడ్ వ‌ద్ద నుండి డ‌బ్బుకు సంబంధించిన విష‌యాల‌ను అన్నీ తెలుసుకున్నాడు. డ‌బ్బు ఒక‌ర‌మైన బ‌లం, ధ‌న‌వంతులు కావాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. ఈ కోరిక మ‌నంద‌రీలోనూ ఉంటుంది. కానీ..దాని క‌న్నా శ‌క్తివంత‌మైన‌ది జ్ఞానం. డ‌బ్బు వ‌స్తుంది..పోతుంది. కానీ డ‌బ్బు ఏం చేస్తుందో మ‌నం తెలుసుకోగ‌లిగే దానిని మ‌న ఆధీనంలోకి తీసుకొని ధ‌న‌వంతులం కావొచ్చు. దాదాపు అంద‌రికీ తెలివి తేట‌లు ఉన్నా, మంచి చ‌దువులు చ‌దివినా ధ‌న‌వంతులు కాక‌పోవ‌డానికి కార‌ణం డ‌బ్బు కోసం ప‌నిచేయ‌డ‌మే. జీవితాంతం డ‌బ్బు కోసం ప‌రిగెత్త‌డ‌మే. నిజానికి ధ‌న‌వంతులు డ‌బ్బు కోసం ప‌నిచేయ‌రు. డ‌బ్బే వాళ్ల కోసం ప‌నిచేస్తుంది. అది ఎలా అంటే? ర‌చ‌యిత రాబ‌ర్ట్ వాటిని 4 ర‌కాలుగా చెప్పాడు.

  1. Business
  2. Investing
  3. Employment
  4. Self Employment.

పైన పేర్కొన్న వాటిలో ఎక్కువుగా క‌ష్ట‌ప‌డేది Employment మాత్ర‌మే. ఈ Employments ఏదో ఒక కంపెనీలోనో, ఆఫీసులోనో ఎవ‌రికిందో డ‌బ్బు కోసం ప‌నిచేస్తుంటారు. ఇక Self Employments మాత్రం ఏదైనా చిన్న సొంత వ్యాపారం పెట్టి అందులో స్థిర‌ప‌డ‌తారు. త‌ర్వాత Bussiness Man అంటే బాగా పెట్టుబ‌డి పెట్టి, అందులోని Employments ని పెట్టుకొని ఒక కంపెనీని న‌డుపుతుంటాడు. వాళ్ల‌కు నెల‌కు జీతాలు ఇస్తూ, వాళ్లో ప‌నిచేయించుకుండాడు. ఇక‌ Investing చేసే వారు ఎలా ఉంటారంటే? ఏదైనా పెద్ద కంపెనీలో కొంత షేర్ ఇన్వెస్ట‌మెంట్ చేసి దానితో వారు లాభాలు తీసుకుంటారు. Investment చేసే వారికి ఎలాంటి Employment అవ‌స‌రం ఉండ‌దు. వారికి ఎటువంటి న‌ష్ట‌మూ ఉండ‌దు. అలా వారు డ‌బ్బు సంపాదించుకుంటారు. పైన తెలిపిన నాలుగు ర‌కాల మ‌నుషుల‌ను ప‌రిశీలిస్తే మ‌న‌కు ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది. జీవితంలో ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డేది మాత్రం ఎంప్లాయిసే. వీరు నెల‌కు వ‌చ్చే మిన‌మం శాల‌రీ కోసం ప‌నిచేస్తూ ఉంటారు. వారి ఖ‌ర్చులు పెరుగుతున్న కొద్దీ వారి శాల‌రీలు మాత్రం ఏమాత్ర‌మూ ఎక్కువుగా రాదు. అలా డ‌బ్బు కోసం వేరే కంపెనీల‌ను మారుతూ జీవితంలో టైం అంతా వృధా చేసుకుంటుంటారు. అలా 60 సంవ‌త్స‌రాల దాకా ఏమీ సంపాదించ‌కుండా ఉండ‌టంతో కాలం గ‌డిచిపోతుంది.

రిచ్ డాడ్ ఏమంటాడంటే..ఉద్యోగం చేయ‌డం వ‌ల్ల జీవితం ఏమీ మార‌దు. జీవితం గ‌డుస్తుంది మాత్ర‌మే. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ మాత్రం ఎటువంటి రిస్క్ చేయ‌కుండా, ఎవ‌రిపైనా ఆధార‌ప‌డ‌కుండా జీవిస్తారు. బిజినెస్ మాన్‌, ఇన్వెస్ట్‌మెంట్ వారు మాత్రం బాగా డ‌బ్బులు సంపాదించి ధ‌న‌వంతులు అవుతున్నారు. అందుకే ధ‌న‌వంతులు ఇంకా ధ‌న‌వంతులు అవుతున్నారు. పేద‌వారు ఇంకా పేద‌వారు అవుతున్నారు. ఇలాంటి డ‌బ్బు గురించి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ చెప్ప‌రు. అందుకే మ‌నం స‌మాజంలోకి వ‌చ్చిన‌ప్పుడు డ‌బ్బు గురించి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీట‌న్నింటి గురించి తెలుసుకునే లోపే మ‌న జీవితం సంగం పూర్తి అవుతుంది. ఇప్పుడు తెలుసుకున్నా ప్ర‌యోజ‌నం కూడా లేద‌ని , క‌నీసం తెలుసుకోవడాన్ని మానేస్తాం. రిచ్ డాడ్ – పూర్ డాడ్ ఇద్ద‌రు తండ్రుల‌కు రాబ‌ర్ట్ కు ఉండ‌టం వ‌ల్ల అన్నీ తెలుసుకున్నాడు. త‌న జీవితంలో 39 సంవ‌త్స‌రాల‌కే ధ‌న‌వంతుల్లో ఒక‌రిగా మారాడు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే రిటైర్డ్ అయ్యాడు. ఒకే ఫ్రెండ్స్.. ఇది చ‌దివిన అంద‌రూ రాబ‌ర్ట్ లాగా ఆలోచించాల‌ని ధ‌న‌వంతులు కావాల‌ని కోరుతూ ధ‌న్య‌వాదాలు!

Latest Post  Money Motivation: మ‌న కాళ్ల కింద కూడా డ‌బ్బులు ఉన్నాయి..కాక‌పోతే న‌మ్మ‌కం లేదు! (స్టోరీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here