RGV Comments: వ‌ర‌ల్డ్ మ్యాప్‌లో తెలుగోడి స‌త్తాను చూపించింది టాలీవుడ్ బాహుబ‌లినే!

RGV Comments ప్ర‌ముఖ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ(Ram Gopal Varma) ఏపీ సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై స్పందించారు. స్పందించ‌డ‌మే కాకుండా కాస్త సాఫ్ట్‌గా ఏపీ ప్ర‌భుత్వానికి సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై అవ‌గాహ‌న లోపమేమో న‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌త కొద్ది రోజులుగా ఏపీ ప్ర‌భుత్వానికి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ నిర్మాత‌ల‌కు, హీరోల‌కు, సినిమా థియోట‌ర్ల‌కు మ‌ధ్య క‌నిపించ‌ని వార్ జ‌రుగుతూనే ఉంది. అంద‌రూ చూసేలా టికెట్లు రేట్లు త‌గ్గిస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెబుతుంటే.. టికెట్ రేటు త‌గ్గిస్తే మాకు ఎలా అని సినిమా పెద్ద నిర్మాత‌లు, అగ్ర‌హీరోల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టికీ ఒక పులుస్టాఫ్ ప‌డ‌టం లేదు. అయితే ఆర్జీవి సైతం సినిమా టికెట్ల(AP Ticket) వ్య‌వ‌హారంపై స్పందించ‌డం ఇప్పుడు సినిమా ప‌రిశ్ర‌మ‌కు బూస్టింగ్ వ‌చ్చిన‌ట్టు ఉంది.

ఆర్జీవీ(RGV Comments on AP Ticket Rates) ఏమ‌న్నారంటే?

తన‌కు రాజ‌కీయాలు తెలియ‌వ‌ని, కేవ‌లం సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తిగా టికెట్ల వ్య‌వ‌హారంపై మాట్లాడుతున్నాన‌ని తెలిపారు. ఒక వ‌స్తువు త‌యారు చేసిన వ్య‌క్తి త‌న‌కు ఇష్టం వ‌చ్చిన రేటుకు అమ్ముకునే హ‌క్కు ఉంద‌ని ఆర్జీవి అన్నారు. ఆ వ‌స్తువు నాణ్య‌త‌ను బ‌ట్టి, అత‌ని ప‌నిని బ‌ట్టి అత‌ను నిర్ణ‌యించిన ధ‌ర‌ను అవ‌త‌ల కొనే వ్య‌క్తికి న‌చ్చితేనే కొంటాడ‌ని ఉదాహ‌ర‌ణ‌కు తెలిఆప‌రు. అదే విధంగా ఇండ్లీ – సాంబారుతో సినిమా టికెట్ల వ్య‌వ‌హారాన్ని పోల్చారు. గుడిసెలో ఇండ్లీ ప్లేటు రూ.50 ఉంటే 5 స్టార్ హోట‌ల్‌లో అదే ఇడ్లీ రూ.500 ఉంటుంద‌ని అన్నారు.

Ram Gopal Varma

తెలుగు సినిమా చరిత్ర‌కు చాలా మార్కెటింగ్ ఉంద‌న్నారు. తెలుగు ఇండ‌స్ట్రీని వ‌ర‌ల్డ్ మ్యాప్ మీద చూపించిన సినిమా రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి అని అన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా ప‌దం తెలుగు ఇండ‌స్ట్రీని తాకింద‌ని, అంత రేంజ్‌లో తెలుగు హీరోలు ఉన్నార‌ని అన్నారు. సినిమా రూ.200 కోట్ల‌తో తీస్తే హిట్ అయితే ప్ర‌భుత్వానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని, అదే విధంగా ప్లాప్ అయితే ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు న‌ష్ట‌పోవాల్సిందేన‌ని అన్నారు. హీరోల‌కు డ‌బ్బులు ఎక్కువ ఇస్తున్నారంటూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌ను తిప్పికొట్టారు. అస‌లు సినిమాలో హీరో ముఖాన్ని చూసే వ‌స్తున్నార‌ని, ఆ హీరో వ‌ల్ల ఎంత బిజినెస్ అవుతుంద‌నే మార్కెటింగ్‌తో అత‌ని రెమున్య‌లేష‌న్ ఉంటుంద‌న్నారు.

Ram Gopal Varma

కావున ఏపీ ప్ర‌భుత్వం ఇద్ద‌రు హీరోల‌ను టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంద‌ని ఆర్జీవి అభిప్రాయ ప‌డ్డారు. ఇప్ప‌టికైనా ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్ల‌పై పున‌రాలోచించాల‌ని, సినిమా టికెట్ల వ్య‌వ‌హారంలో తెలుగు సినిమాను కాపాడే విధంగా ఉండాల‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ అన్నారు.

Share link

Leave a Comment