Cycle rally: ఈ నెల 12న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
Cycle rally: నిర్మల్: పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పేదోడ్ని కొట్టి పెద్దలకు పెడుతున్న కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ కదం తొక్కినట్టు ఆయన పేర్కొన్నారు. సామాన్యుడికి అండగా నిలుస్తూ, పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. ఈ ఆందోళనలు నేపథ్యంలో ఈ నెల 12న సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీకి ఏఐసీసీ పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిర్మల్లో ఐదు కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ లో పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి నిరసన కార్యక్రమం అని తెలిపారు. నిర్మల్ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శంఖారావం పూరించనున్నట్టు పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా ఇంఛార్జులు, ముఖ్య నాయకులతో సమన్వయం చేసుకుని ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. ప్రధాన పట్టణాల్లో ఐదు కిలోమీటర్ల మేర సైకిల్ ర్యాలీ తీయాలని కోరుతున్నామన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!