Revanth Reddy Padayatra : తెలంగాణ రాష్ట్రంలో ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఒక్కప్పుడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా పాదయాత్ర చేసి జనాకర్షణ పొందారో అదే విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలపైనా, ప్రజల సమస్యలపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పాదయాత్రకు పూనుకున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర(Revanth Reddy Padayatra)కు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహరథం పడుతున్నారు.
నీకోసమే తెప్పించా అన్నా: సీతక్క
పాదయాత్ర ప్రారంభం నుండి ఎలాంటి అలుపూసొలుపు లేకుండా నిరంతరాయంగా నడక ప్రారంభించిన రేవంత్ రెడ్డికి వెన్నంటు ఉంటున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తమ అధి నాయకుడు ఆరోగ్య బాగోగులు గురించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిసింది. మూడు రోజుల పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చెప్పులు అరిగిపోయి కాళ్లు నొప్పులు వస్తున్నాయేమో అని భావించిదో ఏమో కానీ, వెంటనే ఎమ్మెల్యే సీతక్క పెయిన్ రిలీఫ్ చెప్పులు తీసుకొచ్చింది. పాదయాత్ర విరామం సమయంలో రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి చెప్పులు తీసి అందించింది. తన బాధను అర్థం చేసుకున్న సొంత కుటుంబ సభ్యురాలిగా ఒక చెల్లిగా ఎమ్మెల్యే సీతక్క చేసిన పనికి రేవంత్ రెడ్డి మౌనంగానే ఆనందాన్ని వ్యక్త పరిచారు. ఎమ్మెల్యే సీతక్క చెప్పులు తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి ఇచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పాదయాత్రలో డప్పు కొట్టిన సీతక్క
రేవంత్ రెడ్డి పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క డప్పు కొట్టి పలువురిని ఆశ్చర్య పరిచింది. పాదయాత్ర(Revanth Reddy Padayatra)లో రేవంత్ రెడ్డి ముందు ఉండి డప్పు కొడుతూ కార్యకర్తలను ఉత్సాహ పరిచింది. ఒకపక్క డప్పు కొడుతూ పలకరించిన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుండి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆయనపైన గుర్రుగానే ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డి కి కట్టబెడతామనుకునే సమయంలో కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకులు ఆయనపై ఉన్న విద్వేషాలు బహిరంగంగానే బయటకు చెప్పారు. నెలల తరబడి టీపీసీసీ పదవి వ్యవహారం సాగినప్పటికీ ఇంత వరకూ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఆంధ్రాలో కూడా అభిమానులు, ఇష్టపడే వారు ఉన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే దమ్మున్న నాయకుడిగా ప్రజలల్లో నమ్మకాన్ని పెంచుకున్నారు.


కనుమరుగయ్యే దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్ని అవమానాలు, అవహేళనలు ఎదురొచ్చినా బెసకకుండా పార్టీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని, నమ్మకాన్ని నింపారు. ఒక పక్క కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి మెలిసి ఉంటూనే మరో పక్క రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఒక్కడిగా గొంతు విప్పుతున్నారు. ఇదే క్రమంలో నమ్మిన బంటుగా, హనుమంతుడిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క రేవంత్ రెడ్డి వెన్నంటే ఉంటుంది. రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి తోనే సీతక్క కలిసి నడుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చూపిస్తున్న చిన్నచూపును నిరసిస్తూ, నల్లచట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీ లో దీక్షలు చేస్తున్న రైతులకు మద్దతుగా పోరాడాలని రేవంత్ రెడ్డి ఈ పాదయాత్ర చేస్తున్నారు.
ఇది చదవండి: విషాదం: యువ జంట ఆత్మహత్యాయత్నం..యువకుడు మృతి!
ఇది చదవండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!
ఇది చదవండి:నిఘా నీడన పంచాయతీ ఎన్నికలు!
ఇది చదవండి:జగ్గయ్యపేటలో కొనసాగుతున్న పోలింగ్
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!
ఇది చదవండి:ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం స్వాధీనం!
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్