Revanth Reddy Biography: అనుముల రేవంత్ రెడ్డి ఈ పేరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రభంజనం. రాజకీయ విమర్శకులకు పెట్టింది పేరు. అవతల ఉన్నది ఎంతటి ఉద్ధండులైనా సరే తనదైన శైలిలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టగల దీశాలి.
రేవంత్ రెడ్డి(Revanth Reddy Biography) 1969 నవంబర్ 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి లో జన్మించారు. 1992లో ఉస్మానియా యూనివర్శిటీ ఏవీ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో ఉత్తీర్ణుడయ్యారు. రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతను వివాహం చేసుకున్నారు.


ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీ సభ్యుడిగా పనిచేశారు. అనంతరం 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2007లో స్వంతత్ర అభ్యర్థిగా శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం తెలుగు దేశం పార్టీలో చేరారు.
కొద్ది కాలంలోనే తెలంగాణ శాసన సభలో పార్టీ ప్లోర్ లీడర్‌గా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం అభ్యర్థిగా రెండుసార్లు ప్రాతినిథ్యం వహించారు. తొలుత 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 2014లో రెండోసారి కొడంగల్ నుంచే ఎన్నికయ్యారు.


మారిన తెలంగాణ రాజకీయాల నేపథ్యంలో అక్టోబర్ 2017 లో టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
2018 సెప్టెంబర్ 20న తెలంగాణ ప్రదేశ్ కమిటీ తరపున ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా నియమితులయ్యారు. అనంతరం జూన్ 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిఈ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.


ఈ సందర్భంగా జూలై 7న బాధ్యతలు స్వీకరించారు. రేవంత్ రెడ్డి దూకుడుతో దళిత, గిరిజన దండోరా సభలతో హస్తం పార్టీ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం రేవంత్ మల్కాజిగిరి నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ 17వ లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!