Respect for Your Child : సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో కాస్త కఠినంగా ఉండే వారు ఉన్నారు. గారాభంగా పెంచే వారూ ఉన్నారు. అయితే పిల్లల్ని కఠినంగా పెంచినా తప్పే.. గారాభంగా పెంచినా తప్పే. అయితే ప్రముఖ కవి యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన ఈ స్టోరీ ఒకసారి చదవండి!.
Respect for Your Child : స్వచ్ఛమైన ప్రేమలాగే గౌరవించడం అనేది కూడా ఓ వ్యక్తి మరో వ్యక్తికిచ్చే కానుక. మనం ఓ వ్యక్తికిచ్చే విలువ అతడి వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుంది. మనం ఎవరినైనా గౌరవించడం మొదలు పెడితే వారికి కూడా మన మీద ప్రేమ, గౌరవం కలుగుతాయి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనేది మానసిక బంధాలను పెంచే మొట్టమొదటి చర్య. ఆ తర్వాత ప్రేమా, ఆప్యాయతలు మొదలవుతాయి. మన పిల్లలని మనం గౌరవించడం అనేది ఎంతో ముఖ్యం. ఇక్కడ గౌరవించడం అంటే వారి అభిరుచుల్ని ప్రోత్నహించడం, వారికీ, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అని అర్థం. పిల్లల పెంపకంలో గౌరవం, ప్రేమ పునాది రాళ్ళులా ఉంటే వాటిమీద పిల్లల ఉన్నత వ్యక్తిత్వం నిర్మించబడుతుంది. అది అద్దాలమేడా, అందమైన మేడా అనేది మీ చేతిలో ఉంది.
అసలు పిల్లలు అంటే ఎవరు?
ఈ ప్రశ్న మీకు విచిత్రంగా కనబడవచ్చు. ఇందులో విచిత్రం ఏమీ లేదు. ఈ ప్రశ్నకు మీరు ఇచ్చుకునే సమాధానం బట్టి మీ మనసులో పిల్లలకు ఎలాంటి స్థానం ఉందో అర్థమవుతుంది. సంసార వృక్షానికి కాసిన సంతాన ఫలాలు కొంతమంది తల్లి దండ్రులకు అనవసర ఫలాలైతే, మరికొంతమందికి అవస రానికి పుట్టిన ఫలాలు. కొందరు అనురాగ ఫలాలని హృదయపూర్వకంగా చెబుతారు. మీరు ఏ వర్గానికి చెందిన వారైనా మీ పిల్లలను మీరెంతో ప్రేమగా చూసుకుంటారు. అందులో సందేహం లేదు. దుర్యోధ నుడిని కూడా ధృత రాష్ట్రుడు ప్రేమగానే చూసుకున్నాడు కదా!. జీవితానికి, బ్రతకడానికి ఎంత బేధం ఉందో పిల్లల్ని కని ఏదో గాలికి పెంచడానికి వాళ్ళను ఉత్తమ వ్యక్తులకుగా తీర్చిదిద్దడానికి మధ్య అంతే బేధం ఉంది.
వరి మొక్కలనే ఉదాహరణగా తీసుకోండి. వడ్లను తీసుకెళ్లి కొన్నిటిని రాయలసీమలో, కొన్నింటిని రాజస్థాన్ ఎడారిలో, మరికొన్నింటిని గోదావరి తీరంలో ఉండే సారవంతమైన భూముల్లో చల్లండి. అవి చక్కగా పెరిగే అవకాశాలు గోదావరి తీరంలోనే ఎక్కువ. మిమ్మల్ని గోదావరి తీరం వెళ్ళి పిల్లల్ని కనమని చెప్పడం కాదు నా ఉద్దేశ్యం. లోపం వడ్లలో లేదని చెప్పడమే నా అభిప్రాయం. భూమి చాలా సారవం తంగా ఉన్నా, పెరుగుతున్న పైరుని, రైతు సరిగా పెంచి పోఫించకపోతే పంట సరిగా రాదు. అంటే ఇక్కడ దోషం కష్టపడని రైతుదన్నమాట.
గోదావరి తీరంలో పెరిగే పంటకి కూడా ఈ ఉపమానం వర్తిస్తుంది. కేవలం స్కూటర్ మీద పిల్లల్ని స్కూల్లో దింపి, నెలకోసారి సినిమాకో, షికారుకో, పార్కుకో తీసుకువెళితే తమ బాధ్యత తీరిపోయిందని అనుకునే తండ్రులు ఇలాంటి రైతులు!. కడుపు నింపే పంటనే మనం ఇంత జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అలాంటిది మన కడుపు పంట ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది చాలా మంది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. పిల్లలు, వాళ్ళ మనస్తత్వాలు ఎప్పుడూ ఒకటే. వాళ్ళు పెరిగే పరిసరాలు, వాళ్ళను పెంచే తల్లిదండ్రులు సమిష్టి సహకారం వాళ్ళ జీవితాలకు, వ్యక్తిత్వాలకు ఊపిరిపోస్తాయి. వాళ్ల మనసులు ఉత్త మట్టిముద్దలు. మనమే ఆ మట్టిని అర్థతాభావంతో తడిపి, చక్కటి మూర్తులుగా తీర్చిదిద్దాలి. ఆ నైపుణ్యం, ఏకాగ్రత, ఓర్పు, సాధన తల్లిదండ్రులు కష్టపడి నేర్చుకొని ముందు తమ వ్యక్తిత్వాలను తాము తీర్చి దిద్దుకొని, తర్వాత పిల్లల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాలి.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్