Arya vysya Corporation: ఖమ్మం: బీజేపీ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖమ్మం నగరంలో మంగళవారం పర్యటించిన నేపథ్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర Arya vysya Corporation ను ఏర్పాటు చేయాలని ఖమ్మం జిల్లా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి, తెలంగాణ రాష్ట్ర ఐక్య సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ వినతిపై స్పందించిన ఎమ్మెల్యే రఘునందనరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వీలైనంత వరకు త్వరగా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతామని సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో వాసుదేవరావు, ఖమ్మం జిల్లా తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి కన్వీనర్ కుంకుమ మృత్యుంజయ గుప్తా, తెలంగాణ రాష్ట్ర ఐక్య సంఘాల రాష్ట్ర కార్యదర్శి వెంకటి రంగారావు, సాయి గణేష్ నగర వాసవి క్లబ్ సెక్రటరీ తేలుకుట్ల ఓంకార్, కందిబండ భిక్షమయ్య, తాటికొండ అరవింద్, సుగ్గల శ్రీహరి తదితర ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!