Republic Teaser : పక్కా పొలిటికల్ యాక్షన్ కథతో వస్తున్న మెగా హీరో | Republic Telugu Movie
Republic Teaser :మెగా ఫ్యామిలీ హీరో సాయిధర్మ్‌తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్(Republic Teaser) మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. ఈ సినిమాలో సాయిధర్మ్‌తేజ్ తో పాటు ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ దేవ కట్టా ఆధ్వర్యంలో వస్తున్న రిపబ్లిక్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.


”ఈ కాలంలో మన జీవితాల నుంచి రాజకీయాలను వేరు చేయ్యలేం” – జార్జ్ ఆర్వెల్
పైన తెలిపిన కొటేషన్ ఆధారంగా సినిమా టీజర్ (Teaser) మొదలవుతుంది. పక్కా పొలిటికల్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న రిపబ్లిక్ సినిమాపై అభిమానుల అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న పెనుమార్పుల ఆధారంగా వస్తున్న సినిమా చెప్పవచ్చు.ఈ సినిమాలో జగపతిబాబు, రమ్య కృష్ణ పొలిటికల్ పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందించారు. టీజర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
సాయిధర్మతేజ్ ఇప్పటి వరకు తన సినిమా కెరియర్లో 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదికి ఒకటీ రెండు సినిమలు తీస్తూ హిట్, ప్లాప్స్తో సంబంధంల లేకుండా ముందుకు సాగుతున్నారు. అయితే తనకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. వాటిలో పిల్లా నువ్వులేని జీవితం, రేయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం, చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే లాంటి సినిమాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి. ఇక చివరిగా 2020 లో తీసిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది. తర్వాత 2021 ఈ ఏడాదిలో రాబోతున్న రిపబ్లిక్ తెలుగు సినిమా జూన్ 4 (2021) విడుదల కానుంది.


Movie : | Republic |
Starring : | Sai Tej, Aishwarya Rajesh, Jagapathibabu, Ramya Krishna |
Directed by : | Devakatta |
Music : | Manisharma |
Editor : | KL Praveen |
DOP : | M.Sukumar |
Produced by : | J B Entertainments |
Youtube video link : | Republic Teaser |


- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started