Success Story : జీవితంలో సక్సెస్ కావాలని అందరూ అనుకుంటారు. కానీ ఆ సక్సెస్ కావడానికి కావాల్సిన కృషి, పట్టుదల మాత్రం కొందరిలోనే ఉంటుంది. ఆ కొందరిలో ఒకరు రేణుకా ఆరాధ్య. రేణుకా ఆరాధ్య(Renuka Aradhya) అసలు సక్సెస్ ఎలా సాధించారో తెలుసుకుందాం!
రేణుకా ఆరాధ్య కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు. చిన్నప్పుడు వాళ్ల నాన్న ఒక పుజారీగా పనిచేస్తూ ఉండేవారు. కానీ వారికి పూట గడిచేది కాదు. అదే క్రంలో రేణుకా ఆరాధ్య(Renuka Aradhya) తన తండ్రి కలిసి వారి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి బియ్యం, పప్పు, గోధుమలు అడుక్కునే వారు. అలా సాయంత్రం వరకూ అడుక్కోగా వచ్చిన వాటిని షాపులో అమ్మి వచ్చిన డబ్బులతో వారికి కావాల్సిన సరుకులు కొనుక్కునేవారు. అలా వారికి రోజు గడిచేది. రేణుకా ఆరాధ్య తన 6వ తరగతి అయిపోగానే ఆయన తండ్రి అతన్ని పనిలో పెట్టాడు. ఆ పనిలో భాగంగా ఆయన కొందరి ఇళ్లల్లో పనిచేసేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రేణుకా ఆరాధ్యను ఓ ముసలి వ్యక్తి వద్ద పనిలో పెట్టాడు. అతనికి కావాల్సిన పనులు చేస్తుండేవాడు. అనంతరం కొన్ని రోజుల తర్వాత ఆరాధ్య తండ్రి చనిపోయారు. ఆ తర్వాత కుటుంబ పోషణ భారం రేణుకా ఆరాధ్యపైనే పడింది.


చదువుకోవడానికి కూడా సమయం దొరకకపోవడంతో పదో తరగతిలో ఫెయిలయ్యాడు. ఆ కారణంతోనే చదువును మానాల్సి వచ్చింది. కుటుంబం అంతా బ్రతకాలంటే డబ్బులు కావాలి కాబట్టి స్వీపర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని వేరు వేరు పనులు కూడా చేశాడు. అదే సమయంలో కార్డ్స్ ఆడటం, మందు తాగడం అలవాటైంది. కొంత కాలం తర్వాత తన జీవితం గురించి బాగా ఆలోచించాడు. ఇవ్వన్నీ వదిలేసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
రేణుకా ఆరాధ్య 20 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తన భార్యను కూడా వేరే పనిలో పెట్టాడు. అలా తన జీవనాన్ని కొనసాగించడంలో భాగంగా ఏ పని దొరికితే ఆ పనిచేస్తూ ఉండేవారు. ఆ క్రమంలోనే ఓ ప్లాస్టిక్ తయారీ కంపెనీలోనూ తర్వాత కొబ్బరి కాయల చెట్లు ఎక్కే పని కూడా చేశారు. అదే విధంగా నెలకు రూ.600 జీతంతో సెక్యూరిటీగా కూడా పనిచేశారు. ఇలా ఎన్ని రోజులు పనిచేసినా లాభం లేదని ఆలోచించాడు. సొంతంగా ఏదైనా చేయాలని గ్రహించాడు.


ఆ క్రమంలోనే రేణుకా ఆరాధ్య ఒక రూ.30,000 లను చేతిలో పట్టుకొని ఆ డబ్బులతో టీవీలు, ఫ్రిజ్‌లపై వేసే కవర్లను విక్రయించే షాపు పెట్టాడు. ఈ పనిలో భాగంగానే అతని భార్య వాటిని కుడుతూ తయారు చేసేది. వాటిని ఆరాధ్య బయట అమ్మేవాడు. కానీ అవి సరిగ్గా అమ్ముడుపోక పెట్టిన డబ్బులు కూడా చేతికి రాక నష్టపోయారు. దీంతో మరింత బాధపడ్డాడు. ఇక వాటన్నింటినీ వదిలేసి డ్రైవర్ అవ్వాలనుకున్నాడు. కానీ డ్రైవర్(driving) కావడానికి కావాల్సినంత డబ్బు కూడా లేదు. ఆ క్రమంలోనే తన పెళ్లికి పెట్టిన ఉంగరాన్ని అమ్మి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు.


అలా డ్రైవర్ ఉద్యోగాన్ని ప్రారంభించాడు. అయితే కొద్ది కాలంలోనే ఒక యాక్సిడెంట్ కావడంతో ఆ ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత రేణుకా ఆరాధ్య ఒక హాస్పిటల్ లో డెడ్ బాడీ(dead bodys)లను పట్టుకుని వెళ్లే ఉద్యోగంలో చేరాడు. అలా 4 సంవత్సరాలు ఏకదాటిగా చేశాడు. కానీ అందులో డబ్బులు తక్కువుగా రావడం వల్ల వేరేది ఏమైనా చేయాలనుకున్నారు. ఆ క్రమంలోనే విదేశీ పర్యాటకులకు వివిధ ప్రాంతాలను చూపించే పనిలో చేరాడు. అప్పుడు ఆ విదేశీయుల నుండి టిప్ కూడా లభించేది. ఇలా వచ్చిన మొత్తాన్నికి అతని భార్య యొక్క ఫిఎఫ్ను జమచేసి 2001 సంవత్సరంలో ఒక సెకండ్ హ్యాండ్ ఇండికా(indica car) కారును కొనుగోలు చేశాడు. దాని వల్ల వచ్చిన డబ్బుతో మరొక్క కారును కూడా కొన్నాడు. అలా 2006 సంవత్సరం వచ్చేసరికి 5 కారులను కొన్నాడు.


అంతే కాకుండా సొంతంగా సిటీ సఫారీ (city safari)అనే ట్రావెల్ ను కూడా పెట్టాడు. అదే సమయంలో ఓ ఇండియన్ సిటీ టాక్సీని అమ్మేస్తున్నారనే విషయం తెలిసింది. అప్పుడు 2006 సంవత్సరంలో రూ.6 లక్షలతో దానిని కొనుగోలు చేశారు. దాని కోసం అతని వద్ద ఉన్న కార్లను అమ్మాల్సి వచ్చింది. తర్వాత దానిని రేణుకా ఆరాధ్య ప్రవాసీ క్యాబ్‌గా మార్చాడు. ఇక అప్పటి నుంచి అతనికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని అవసరం లేదు. అలా 2018 సంవత్సరానికి తన బిజినెస్‌ను చెన్నై మరియు హైదరాబాద్‌కు కూడా విస్తరింప జేశాడు. అలా తన క్యాబ్స్ సంఖ్య 1300లకు చేరింది. ఇక మార్కెట్లోకి ఊబెర్, ఓలా (uber,Ola Cabs)లాంటి కంపెనీలు వచ్చినప్పటికీ అతని బిజినెస్‌ను ఏమాత్రమూ కదల్చలేకపోయాయి. ఎందుకంటే రేణుకా ఆరాధ్య తన కష్టాన్నే నమ్ముకున్నాడు కాబట్టి ప్రతిఫలం కూడా అదే విధంగా దక్కింది. ఒక్కప్పుడు ఇల్లూ..ఇల్లూ తిరిగి అడుకున్న వ్యక్తి ఇప్పుడు రూ.50 కోట్ల కంపెనీకి ఓనర్ అయ్యారు.
- Impact of Social Media in our Life
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం