Rent House: నెల్లూరు: కరోనా ఎంత అవమానకరంగా మనుషులను, సమాజాన్ని మార్చుతుందో ఇప్పటికే పలు వార్తల్లో ప్రపంచ వ్యాప్తంగా మనం చూసేవుంటాం. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో ఒకటి చోటు చేసుకుంది. కరోనా వచ్చి తగ్గిపోయినప్పటికీ భర్త ఆరోగ్యం క్షీణించి చనిపోవడంతో అంత్యక్రియలు అనంతరం ఆ వృద్ధురాలిని అద్దె ఇంటి(Rent House) యజమాని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో అయ్యా నన్ను ఇంటిలోకి రానివ్వండి అంటూ ఆ వృద్ధురాలు రోడ్డుపైన ఆవేదన వ్యక్తం చేసింది.
నెల్లూరు శివగిరి కాలనీ మూడో వీధిలో రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సాయినాథ్ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. అయితే కొద్ది రోజుల తర్వాత టెస్టులు చేయించుకోగా నెగిటివ్ అని వచ్చింది. అయినప్పటికీ అతని ఆరోగ్యం క్షీణించడంతో జీజీహెచ్లో మృతి చెందారు. అంత్యక్రియులు అయిన తర్వాత వృద్ధురాలైన అతని భార్య భారతమ్మ శివగిరి కాలనీలో వారు ఉంటున్న అద్దె ఇంటిలోకి వెళుతుండగా, ఇంటి యజమాని ఆమెను అడ్డుకున్నాడు. ఇంటిలోకి అనుమతించేది లేదంటూ తెగేసి చెప్పాడు. దీంతో ఆమె ఇంటి ఎదురుగా రోడ్డుపైన కూర్చొని రోదించింది. ఒక వైపు భర్త చనిపోవడం, మరో వైపు ఇంటిలోకి రానివ్వకపోవడంతో ఆ బాధిత మహిళ కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది.
జిల్లా ఉన్నతాధికారులు కరోనాపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. నెల్లూరు నగరంలో కరోనా వస్తే అద్దెకు ఉంటున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. భారతమ్మ విషయంలో జిల్లా అధికారులు తక్షణం స్పందించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?