Remove Whiteheads: కొందరికి Blockహెడ్స్ సమస్య ఉంటే, మరికొందరిని Whiteheads సమస్య ఇబ్బంది పెడుతుంది. చర్మంపై చాలా చిన్నగా తెల్లని మచ్చల్లా కనిపిస్తుంటాయి. ఇవి సాధారణంగా అందరి ముఖంపైనా కనిపిస్తుంటాయి. ఇది ఒక ఇబ్బంది కరంగా కూడా ఉంటుంది. వైట్‌హెడ్స్, ముక్కూ, నుదుడిపై ఎక్కువుగా కనిపించే ఈ సమస్యను తగ్గించుకోవాలంటే(Remove Whiteheads) ఏం చేయాలో తెలుసుకోండి!.
Remove Whiteheads: వైట్‌హెడ్స్‌ను ఇలా తొలగించుకోండి
స్నానం చేసే ముందు మీ ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల Whiteheads కాస్త బయటకు కనిపిస్తాయి. ఆ తరువాత వైట్‌హెడ్స్‌ని తొలగించడం సులువు అవుతుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో నీళ్లు కలిపి మెత్తని ముద్దలా చేసి సమస్య ఉన్న చోట పూతలా రాయాలి. పదిహేను నిమిషాల తర్వాత ఈ పూతను తీసేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే సమస్య అదుపులోకి వచ్చేస్తుంది.
స్పూన్ వంటసోడాలో కాసిన్ని నీళ్లు కలపాలి. దీన్ని Whiteheads ఉన్న చోట రాయాలి. ఆ వంట సోడా పూత ఆరిపోయాక కడిగేయాలి. ఇలా తరుచూ చేస్తుంటే అధిక జిడ్డు పోవడమే కాదు. వైట్‌హెడ్స్ సమస్య కూడా తగ్గుతుంది. ఒకటిన్నర చెంచా సెనగపిండిలో అలివ్‌నూనె వేస్తూ ముద్దలా చేసుకోవాలి. దీన్ని వైట్‌హెడ్స్ ఉన్న చోట పూతలా వేసుకుని బాగా ఆరిపోయాక కడిగేయాలి. ఇది మృతచర్మాన్ని తొలగించడమే కాదు. వైట్‌హెడ్స్ సమస్యనూ అదుపులో ఉంచుతుంది.
చిన్న బంగాళదుంప ముక్కను తీసుకని సమస్య ఉన్న చోట మర్ధన చేసినట్టు రాయాలి. పది నిమిషాల తరువాత పాలల్లో దూదిని ముంచి, తుడవాలి. రోజులో కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. దానివల్ల శరీరంలో వ్యర్థాలు బయటకుపోయి, ఈ సమస్య తగ్గుతుంది. తీసుకునే ఆహారం పండ్లూ, కూరగాయలూ ఎక్కువుగా ఉండేలా చూసుకోవాలి.
ముఖం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఔషధ గుణాలున్న సబ్బు లేదా సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసిన క్లేన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
Remove Whiteheads | మెరిసే మోముకి చిట్కాలు
బీట్‌రూట్‌ని తీసుకని బాగా ఉడకబెట్టాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి, రెండు చెంచాల పాలు, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకి రాసుకుని అరగంట పాటు వదిలేయాలి. ఆరాక మంచినీళ్లతో కడిగేయాలి. సెనగపిండితో రెండు మూడు చెంచాల సెనగపిండిలో చెంచా పాలమీగడా, మూడు చెంచాల గోధుమల పొట్టు, కాస్త పెరుగూ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత కడిగేసుకోవాలి.


కీరదోస ముక్కల్ని గుజ్జులా చేసుకోవాలి. దానికి పావుకప్పు నిమ్మరసం,అయిదు చెంచాల తేనె, పాలు చేర్చి బాగా కలపాలి. ఈ గుజ్జు మరీ జారిపోతున్నట్టు ఉంటే కొంచెం వరిపిండి కలిపి గట్టిగా చేయొచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని అయిదారు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత తీసి ముఖానికి పూతలా వేసుకుని 20 నిమిషాల పాటు ఉంచి, ఆరాక కడిగేసుకోవాలి. నిమ్మతో కేవలం ముఖానికి పూతలు వేసుకోవడమే కాదు, నలుగు పెట్టుకోవడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చెంపలు నిగారింపు పొందుతాయి. పావుకప్పు నిమ్మరసంలో పాలు కలిపి దాంతో చెంపలకు రాసుకోవాలి. ఇలా తరుచూ చేస్తుంటే చెంప భాగంలో రక్తప్రసరణ పెరిగి గెలాబీ రంగులో మెరుస్తాయి.