Remidicherla News : ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రేమిడిచర్ల మైనర్ బాలిక కిడ్నాప్ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. బాలిక ఉత్తర్ ప్రదేశ్‌లో దొరకడంతో కేసు సుఖాంతమైంది. ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్ కిరణ్ కేసును ఛేదించడంలో ఉన్నతాధికారుల సూచనలతో చాకచక్యంగా వ్యవహరించిన తీరుతో సుమారు 100 రోజుల తర్వాత కేసు చిక్కుముడి వీడింది. రేమిడిచర్ల గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి క్షుద్ర పూజల పూజారి సూర్య ప్రకాష్ శర్మ అతని వెంట తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరూ ఉత్తర్ ప్రదేశ్ లో తలదాచుకున్నారు. వంద రోజుల తర్వాత పోలీసుల శ్రమ ఫలితంగా నిందితులను ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్ కిరణ్ పట్టుకున్నారు. త్వరలో మీడియా ముందుకు నిందితుడును ప్రవేశ పెట్టనున్నట్టు మధిర సీఐ ఓ. మురళి తెలిపారు. ఎస్సై ఉదయ్ కిరణ్‌ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
గతేడాది క్షుద్ర పూజల కలకలం.. బాలిక్ మిస్సింగ్ కేసు!
గతేడాది (2020) డిసెంబర్ 18న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో గుప్త నిధుల కోసం ఓ కుటుంబం క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్టు అప్పట్లో వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ నేపత్యంలో మైనర్ బాలిక అదృశ్యం కావడం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం మరింత చర్చనీయాంశంమైంది. రేమిడిచర్ల గ్రామానికి చెందిన గద్దె నరసింహారావు అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, ఓ వ్యక్తితో క్షుద్ర పూజలు నిర్వహించారని అదే విధంగా ఇంట్లో 30 అడుగుల లోతు గుంట కూడా తీయడంతో గ్రామంలో అలజడి రేగింది. ఈ క్రమంలో బాలిక ఆరోగ్యం బాగోక పోవడంతో గుంటూరు జిల్లాలోని పెద కాకాని దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించుకొని రావాలని తల్లి తన బంధువైన ఒకరితో చెప్పి పంపించింది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న రాణి అనే బంధువు కనిపించడంతో తన 16 ఏళ్ల కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది.


ఈ నేపథ్యంలో గద్దె నరసింహరావు అతని కుటుంబ సభ్యులను ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు ఇవ్వడం, అనంతరం 20 రోజులు గడవడంతో క్షుద్ర పూజల విషయం వెలుగులోకి వచ్చింది. సదరు బాలికను బలిచ్చేందుకు ముందస్తు పూజలు చేశారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. దీంతో తల్లి ఎర్రుపాలెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి మీడియాలో ఈ ఘటన సంచలన వార్తగా నిలిచింది. ఈ కేసు విషయమై ఎర్రుపాలెం ఎస్సై ఉదయ్ కిరణ్ తీవ్రంగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. మొత్తంగా కొన్ని నెలలు అనంతరం ఇప్పుడు మళ్లీ మైనర్ బాలిక బ్రతికే ఉందని, పూజారీ తీసుకెళ్లాడని తెలియడంతో రేమిడిచర్ల మైనర్ బాలిక అదృశ్యం కేసు సుఖాంతమైంది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court