AP SEC Nimmagadda Ramesh Kumar | released AP Local body elections -2021 notification | మోగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల గంట‌! మ‌రి స‌జావుగా న‌డిచేనా?

Spread the love

AP SEC Nimmagadda Ramesh Kumar | released AP Local body elections -2021 notification | మోగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల గంట‌! మ‌రి స‌జావుగా న‌డిచేనా?

Vijayawada: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ను ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ శ‌నివారం విడుద‌ల చేవారు. ప్ర‌కాశం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల మిన‌హా మిగ‌తా జిల్లాల్లో తొలిద‌శ ఎన్నిల‌కు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలిపారు. ఉద‌యం 6.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. నాలుగు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ అన్నారు.

ఈ సంద‌ర్భంగా శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ పంచాయ‌తీ రాజ్ శాఖ మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ బాధ్య‌తా రాహిత్యం వ‌ల్లే స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని నిమ్మ‌గ‌డ్డ పేర్కొన్నారు. 2019 ఓట‌ర్ల జాబితాతో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఓటు హ‌క్కు కోల్పోయిన వారిలో మూడున్న‌ర ల‌క్ష‌ల మంది ఉన్నార‌న్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ గంద‌ర‌గోళానికి కార‌ణం ఎవ‌రు అన్న దానిపై గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌గ్న నివేదిక ఇస్తామ‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే ఆల‌స్యం: ఎస్ఈసీ

రాజ్యాంగ ఆదేశాల మేర‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు స‌కాలంలో నిర్వ‌హించ‌డం త‌మ విధి అని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ అన్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఆల‌స్య‌మైం ద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్న‌త‌స్థాయి న్యాయ స్థానం ఇరు వాద‌న‌లు విని స‌హేతుక తీర్పు నిచ్చింద‌న్నారు. హైకోర్టు తీర్పుతో ఎన్నిక‌లు ప్ర‌క్రియ ప్రారంభించామ‌న్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంద‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్లు వాళ్ల ప‌రిస్థితుల దృష్ట్యా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యాన్ని ప్ర‌జా అవ‌స‌రాల దృష్ట్యా ఉద‌యం 6.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3.30 దాకా ఉంటుంద‌ని, సాయంత్రం 4 గంట‌ల నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు స‌న్నాహాలు చేస్తున్నామ‌న్నారు. ఎన్నిక‌లు ఏర్పాట్లు సంతృప్తిక‌రంగా ఉన్నాయ‌న్నారు. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు సీఎస్‌తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ప‌ని ఒత్తిడి ఉన్నా వారంద‌రూ వ‌స్తార‌ని ఆశిస్తున్నామ‌న్నారు. ఎటువంటి స‌మ‌స్య‌నైనా చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్కార‌మ‌‌వుతాయ‌న్నారు.ఇది చ‌ద‌వండి:ముదురుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల “రాజ‌కీయ” పంచాయ‌తీ

పంచాయ‌తీ రాజ్ శాఖ విఫ‌లం: ఎస్ఈసీ

రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ ప‌నితీరు మెరుగ్గా లేద‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఓట‌ర్ల జాబితా ఫైన‌ల్ చేయ‌డంలో పంచాయ‌తీ రాజ్ శాఖ పూర్తిగా విఫ‌ల‌మైంద‌న్నారు. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు, మధ్యాహ్నం 3 గంట‌ల‌కు, సాయంత్రం 5 గంట‌ల‌కు స‌మావేశం నిర్వ‌హించినా పంచాయ‌తీ శాఖా అధికారులు రాలేద‌న్నారు. ఓట‌ర్ల జాబితా స‌రైన స‌మ‌యంలో ఇవ్వ‌ని కార‌ణంగా ఆ శాఖా అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. సోమ‌వారం సుప్రీం కోర్టు లో వాద‌న‌లు ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌న‌డం స‌హేతుకంగా లేద‌న్నారు.

AP Local body elections

సీఎస్ లేఖ ముందే లీక్

సీఎస్ లేఖ ఎస్ఈసీతో సంప్ర‌దించే విష‌యంలో గోప్యంగా ఉంచాలి..కానీ మీడియాకు లీక్ చేసిన త‌ర్వాత త‌న‌కు వ‌చ్చింద‌ని, ఇది మంచిది కాద‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ అన్నారు. సామాజిక సేవా ధృక్ప‌థంతో చాలామంది ఎన్నిక‌ల్లో పాల్గొంటారు. వారి ప‌ట్ల దాడులు జ‌రిపితే క‌మిష‌న్ సీరియ‌స్‌గా తీసుకుంటుంద‌ని అన్నారు. అభ్య‌ర్థుల స‌మ‌స్య‌లుంటే క‌మిష‌న్ దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. ఎన్నిక‌ల ద్వారానే నిధులు, విధులు బ‌ల‌ప‌డ‌తాయి కాబ‌ట్టి, ఎన్నిక‌ల‌ను అంద‌రూ స్వాగ‌తించాల‌ని కోరారు. ఏక‌గ్రీవాల‌పై క‌మిష‌న్ దృష్టి పెడుతుంద‌న్నారు. అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌నే ఐజీస్థాయి అధికారిని నియ‌మించామ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు స‌హ‌క‌రిస్తామ‌ని హైకోర్టుకు తెలిపింద‌ని నిమ్మ‌గ‌డ్డ అన్నారు. కానీ ప్ర‌భుత్వం స‌హ‌కారం లేదు, ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వాన్ని స‌హ‌క‌రించేలా ఆర్డ‌ర్ గ‌వర్న‌ర్ ఇవ్వాల‌ని రాజ్యాంగంలో ఉంద‌ని అన్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా నిర్వ‌హించి తీరుతామ‌ని తెలిపారు.

ఏపీలో ఎందుకు ఎన్నిక‌లు వ‌ద్దు?

ఉద్యోగ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నాయ‌ని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ అన్నారు. దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రుగుతుంటే ఏపీలో మాత్రం వ‌ద్ద‌న‌డం స‌రికాద‌ని సూచించారు. ప్ర‌జా సంక్షేమం కోసం ప‌నిచేయాలి కానీ విస్మ‌రిస్తే దుష్ప‌లితాలుంటాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేవారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు ఆటంకం ఏర్ప‌డితే ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అని తేల్చేశారు. సోమ‌వారం సుప్రీంకోర్టులో అవ‌స‌ర‌మైతే ఎన్నిక‌ల క‌మిష‌న్ నివేదిక అందిస్తుంద‌న్నారు. ఎన్నిక‌ల్లో క్షేత్ర‌స్థాయిలో పాల్గొనాల‌ని ప్ర‌జ‌ల‌కు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ని పేర్కొన్నారు.

ఇది చ‌ద‌వండి : బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేవాళ్లం కాదు!
ఇది చ‌ద‌వండి : నా విజ‌యం వెనుక అమ్మ ఉంది
ఇది చ‌ద‌వండి : న‌కిలీ మిర‌ప‌నారు..ల‌బోదిబోమంటున్న రైత‌న్న‌లు

ఇది చ‌ద‌వండి: 19న నితిన్ కొత్త సినిమా ‘చెక్’ విడుద‌ల‌

ఇది చ‌ద‌వండి: గ్రామాల‌కు సీఎం జ‌గ‌న్ శుభ‌వార్త‌

ఇది చ‌ద‌వండి: క‌స్ట‌మ‌ర్లగా వ‌చ్చారు. కోట్ల‌లో లూటీ చేశారు!

SP Ravindra Babu : స‌మ‌స్యాత్మ‌క గ్రామాల్లో ప‌ర్య‌టించిన ఎస్పీ ర‌వీంద్ర‌బాబు

SP Ravindra Babu : Gudivada: కృష్ణాజిల్లా గుడివాడ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు గ్రామాల్లో కృష్ణా జిల్లా ఎస్పీ ర‌వీంద్ర‌బాబు శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల Read more

Local panchayat elections : టీచ‌ర్ల‌ను ఇవ్వండి..ఓట్లేస్తాం..!

Local panchayat elections : టీచ‌ర్ల‌ను ఇవ్వండి..ఓట్లేస్తాం..! Visakapatnam: విశాఖ‌ప‌ట్టణం జిల్లా గూడెం కొత్త‌వీధి మండ‌లం ధార‌కొండ గ్రామ‌స్థులు కొత్త‌గా ఆలోచించారు. త‌మ గోడు ప‌ట్టించుకోని అధికారులు Read more

Razole Constituency : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాకు టిడిపి మ‌ద్ద‌తు!

Razole Constituency : పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాకు టిడిపి మ‌ద్ద‌తు! Razole:  తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం మ‌గ‌ట‌ప‌ల్లి గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో తెలుగుదేశం పార్టీ జ‌న‌సేన‌కు Read more

పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి

పంచాయ‌తీ ఏక‌గ్రీవాలు: నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి ఖాతాలోకి గోక‌రాజుప‌ల్లి Nandigama : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ అటు వైస్సార్‌సీపీలోనూ, ఇటు టిడిపి పార్టీలోనూ Read more

Leave a Comment

Your email address will not be published.