kidnapping case: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువు కిడ్నాప్
నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో హత్య
kidnapping case: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంధువు కిడ్నాప్Nellore: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ధరంసింగ్ బంధువు సిద్ధార్థ దేవేందర్‌ను (28) కొందరు దుండగులు కిడ్నాప్ (kidnapping )చేశారు. నెల్లూరు జిల్లా రావూరు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పూడ్చి పెట్టారు.
వాస్తవంగా సిదార్థ అమెరికాలో ఉంటుండగా ఇటీవలే కర్ణాటక లోని అమృతహళ్లికి వచ్చారు. ఈ సందర్భంగా స్నేహితులను కలవాలని నిర్ణయించుకున్నారు. గత నెల (జనవరి 19)న ఇంటి నుంచి బయలు దేరిన సిద్ధార్ణ అదృశ్యమయ్యారు. బయటకు వెళ్లిన కుమారుడు ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన ఆయన తండ్రి గత నెల 26న అమృతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు(kidnapping case) సిద్ధార్థ ను తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. వారిలో ఒకరిని అందుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థను హత్య చేసినట్టు గుర్తించారు. అమృతహళ్లి పోలీసులు నిన్న రాపూరు అటవీ ప్రాంతానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇది చదవండి:పంచాయతీ తీర్పులో మాజీ సర్పంచ్‌పై కత్తితో
దాడిఇది చదవండి:మదనపల్లె కేసు వాదనకు ముందుకొచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది
ఇది చదవండి:భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి!
ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్