Redwood Smugglers Arrested in Chittoor | నలుగురు తమిళ స్మగర్లు అరెస్టు
Redwood Smugglers Arrested in Chittoor | నలుగురు తమిళ స్మగర్లు అరెస్టుChittoor: ఎర్రచందనం చెట్లను నరికేందుకు వెళుతున్న నలుగురు తమిళ స్మగ్లర్లు(Redwood Smugglers)ను గుర్తించి అరెస్టు చేసినట్టు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య బుధవారం తెలిపారు. ఎర్రచందనం చెట్లను నరికివేయకుండా నిరోధించే ప్రయత్నంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది విధులు సత్ఫలితాలు ఇస్తున్నా యన్నారు. ఇందులో భాగంగా ఆర్ ఎస్ ఐ లు ఎం.వాసు, లింగాధర్ టీమ్ లకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఈ రెండు బృందాలు భాకరాపేట అటవీ పరిధిలో నలుగురు తమిళ స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఆర్ ఎస్ ఐ వాసు టీం బుధవారం ఉదయం తమిళనాడు తిరువన్నామలై జిల్లా షేన్ బగ తోపుకు చెందిన రామస్వామి, గణమలైకు చెందిన కుప్పన్ లను అరెస్టు చేశారని తెలిపారు.

అదే విధంగా లింగాధర్ టీమ్ మంగళవారం అదే తిరువన్నామలై జిల్లా నమ్మిబట్టు గ్రామానికి చెందిన ఎం.కుమార్, చిన్నప్పన్ లను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. భాకరాపేట, దేవరకొండ బీట్ పరిధిలో పెద్ద ఇటుకల బండ వద్ద వీరిని కనుగొన్నట్టు తెలిపారు. విచారణలో వీరిని పంపిన ప్రధాన నేరస్థుల వివరాలు కూడా కనుగొన్నామని చెప్పారు. శివాజీ, పెరుమాళ్ అనే వ్యక్తుల ద్వారా వీరు శేషాచలం అడవులకు చెరుకున్నట్టు విచారణలో వెళ్లడయ్యిందన్నారు. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుంటామన్నారు. విచారణలో ఆర్ ఐ భాస్కర్, సిఐ వెంకట రవి, డీఆర్ఓ నరసింహారావు పాల్గొన్నారు.
ఇది చదవండి: మళ్లీ రాజకీయాల్లో రాబోతున్న మెగాస్టార్!
ఇది చదవండి:స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ-జనసేన పార్టీలు
ఇది చదవండి:హత్యకు గురైన స్వామీజీ? వివాదమే కారణమా?
ఇది చదవండి:ఈ ఎన్నికలకు మీరు దూరంగా ఉండాలి: ఎస్ఈసీ
ఇది చదవండి: కరోనా సేవలకుగాను సీఐకి ప్రశంసాపత్రం అందజేత
ఇది చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఇది చదవండి:పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల వివరాలు