Reduce Tension: నేటి సమాజంలో ఒత్తిడి లేనిచదువు, ఉద్యోగం, పని ఎక్కడా కనిపించడం లేదు కదా. ఎటు చూసినా చిన్నల నుండి పెద్దల వరకు అంతా తీవ్రమైన ఒత్తిడికి గురవు తున్నారు. ఒత్తిడి వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటాయి. నేటి యువత అదికంగా ఒత్తిడికి గురవ్వడం వల్ల పలే సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఒత్తిడికి గురవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు గాని, సంఘటన జరిగినప్పుడు గానీ ఏదైనా సవాలు (ఛాలెంజ్) కు గాని ఆ వ్యక్తిలో శారీరకంగా మానసికంగా వ్చే మార్పులను ఒత్తిడిగా చెప్పవచ్చు. ఒత్తిడి వ్యక్తిలోని అసహనాన్ని, అనుకోని ఉద్వేగాలను బయటకు తీస్తుంది. దానివల్ల మనకు అనేక రకాలుగా దుష్ఫలితాలు ఎదురవుతాయి కొంత మంది ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు వరకు వెళ్తున్నారంటే దాని తీవ్రత ఎలా ఉందో ఆలోచించాలి.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఒత్తిడి లేని చోటు ఆనందరం, విజయం కూడా ఉం డవు. అంటే ఒత్తిడికి ఇస్త్రీ పెట్టెను ఉదాహరణగా తీసుకుంటే పెట్టె సరిగా వేడి ఉంటేనే దుస్తులు చక్కగా ఇస్త్రీ చేయబడతాయి. వేడి లేని పెట్ట ఎందుకు పనికిరాదు. అలాగే వ్యక్తి జీవితానికి ఉండాల్సిన మోతాదులో ఒత్తిడి ఉండాలి. లేదంటే లక్ష్యాలు అతిత్వరగా చేరుకోలేము. విజయాలు సొంతం కావు.
Reduce Tension: ఒత్తిడి లక్షణాలు
ఒక్కోసారి ఏకారణం లేకుండా మీరు విపరీతమైన ఆలోచనలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఆ సమయంలో మీకు ఛాతి నొప్పి, చెమటలు ఎక్కువగా వేయడం, కాళ్లు చేతులు వణక కుండా, జుట్టుపీక్కోవడం, నిద్రపట్టకపోవడం, జ్ఞాపక శక్తి క్షీణించడం, గుండె వేగంగా కొట్టుకోవడం దేనిపైన ఆ శక్తి లేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనిపిస్తుంది.
ఒత్తిడి నిర్వహణ : ఒత్తిడిలో కొన్ని అంశాలను మేలుచేస్తుందని కొన్ని అంశాలను కీడు చేస్తుంది. అంటే మంచి ఒత్తిడి, చెడ్డ ఒత్తిడి అని రెండుంటాయి.
ఒత్తిడికి కారణమైన అంశాల్ని పరిశీలించండి. వాటిని విశ్లేషిస్తే వెంటనే వాటిని సరిచేసుకొని ఒత్తడి నుండి బయటపడవచ్చు. ఒత్తిడి వల్ల శ్వాస వేగంగా కొట్టుకోవడం, టెన్షన్ ఏర్పడటం జరుగుతుంది. అందువల్ల యోగా, ధ్యానం లాంటివిచేస్తే దాని నుండి బయటపడొచ్చు. సకాలంలో ప్రశాంతంగా నిద్రించడం, సరైన ఆహార నియమాలు పాటించడం చేయాలి. శరీరానికి పడని పదార్థాలు తినకుండా మానేయాలి. వాస్తవ ధృక్పథం కలిగి ఆలోచించాలి.
మన సామర్థ్యాన్ని నైపుణ్యాల్ని అంచనాలేసి చేయాల్సిన పనులు చేయాలి చేయలేని, చేతగాని పనులు చేస్తామని చెప్పి ఒత్తిడికి గురై పది మందిలో పరువు పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. సమయపాలన అన్ని రకాల ఒత్తిడిలను (Reduce Tension) దూరం చేస్తుంది. సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకుని ముందుకు సాగాలి. ఆసక్తి లేని అంశాల జోలికి పోకూడదు. ఎందుకంటే వాటివల్ల ఒత్తిడి పెరుగుతుంది. మనలో ఉన్న సామర్థ్యాలు ఆసక్తులు గురించి ముందుకెళ్తే విజయాలు సొంతం అవుతాయి. కాకుంటే అజయాలు అవమానాలు ఎదురవుతాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రతి అడుగూ ముందుకేయాలి. లేకుంటే అనేక ఇబ్బందులు చుట్టు ముట్టి ఇబ్బంది పెడతాయి. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి నుండి బయటపడటానికి కావాల్సిన రిలాక్స్ టెక్నిక్స్ అంటే మంచి ఆహ్లాదకర సంగీతం వినడం, నచ్చిన ఆటలు ఆడటం, నచ్చిన సినిమాలు చూడటం చేయాలి. నిరాండబరజీవన శైళిని అలవర్చుకొని లేనిపోని బడాయిల్ని వదులు కొంటే ఒత్తిడి జీవితంలోకి రాదు.
కాబట్టి నేజి సమాజంలో యువత అనవసర హడావిడులకు గురై జీవన నైపుణ్యాలు తెలీక ఒత్తిడికి గురై ఆత్మహత్యల వరకు పోతున్నారు. చిన్న జాగ్రత్తలు పాటించి ఒత్తిడిని అధిగ మించి విజయం వైపునకు జీవితాల్ని మలచుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.