Red Sandalwood చిత్తూరు జిల్లా కుప్పం లో మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ డాన్ రామనాథరెడ్డిని శనివారం ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా కు సంబంధించి ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు కుప్పం అర్బన్ పిఎస్ ఇన్స్పెక్టర్ ఎ.సాధిక్ అలీ, ఎస్సై సి.ఉమా మహేశ్వర్ రెడ్డి, స్పెషల్ పార్టీ టీమ్ ప్రణాళికతో కుప్పం-కృష్ణ గిరు హైవేపై నడుమూరు చెక్‌పోస్టు వద్ద సుమారు రాత్రి మూడుగంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీ నిర్వహించారు. అనుమానస్పదంగా ఉన్న ఒక 12 టైర్ల లారీ, ఒక స్కార్పియో వాహనాలను పట్టుకొని తనిఖీ చేయగా అందులో 62 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు తేలింది. ఈ కేసుకు సంబంధించి కడప జిల్లాకు చెందిన మోస్ట్ వాంటెడ్, అంతర్జాతీయ స్థాయి లో ఎర్రచందనం ను ట్రాన్ఫోర్ట్ చేసే ఎర్రచందనం స్మగ్లర్ వింజమూరు రామనాథరెడ్డిని అతని అనుచరులు ముగ్గురుని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు మరియు వాహనాల విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుంది.(Red Sandalwood)
మోస్ట్ వాంటెడ్ క్రిమినెల్ అరెస్టు


కడప జిల్లా చాపాడు మండలం చెండ్లూరు గ్రామానికి చెందిన (ప్రస్తుతం నెల్లూరు జిల్లా వింజమూరు టౌన్) గుడ్డేటి రామనాథరెడ్డి అలియాస్ వింజమూరు రామనాథరెడ్డి అలియాస్ రామనాథ్ గా గుర్తించారు. ఇతను ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన మోస్ట్ వాంటెడ్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం ఎగుమతి చేస్తున్నట్టు తేలిసిందన్నారు. ఇతను గతలో దుబాయ్ సాహూల్ భాయ్‌తో కలిసి సుమారుగా 400 నుంచి 500 టన్నుల ఎర్రచందనం దుంగలను దుబాయ్‌కి ఎగుమతి చేశాడు. 2013 లో దొరికిన 32 టన్నుల ఎర్రచందనం కొల్లాం గంగిరెడ్డి కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.
కోల్‌కత్తాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌తో కలిసి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఇతనపై కపడ, కర్నూలు, అనంతపురం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సుమారు 60 కేసులు ఉన్నట్టు జిల్లా పోలీసులు తెలిపారు. ఇతనితో పాటు గుర్రంపాటి ఈశ్వర్ రెడ్డి, చిన్నం మల్లయ్య, సుంకర భీమయ్య పోలీసులు అరెస్టు చేశారు.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్