Red Sandalwood Case : Kadapa : రాయచోటి రేంజ్ అటవీ శాఖ పరిధిలోని మురళీకృష్ణ ఫారెస్ట్ రేంజర్ ఆధ్వర్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వంగిమల్ల సెక్షన్‌లోని గడికోట బీట్ నందు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో 8 ఎర్ర చందనం దుంగలను పట్టుకున్నారు. వాటిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా అణయికట్ తాలూకా కట్టిపట్టు గ్రామానికి చెందిన వేలూరు కు చెందిన స్వామినాథన్ ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఎర్ర చందనం దుంగలు ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.1 లక్ష ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పారిపోయిన వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ కూంబింగ్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎన్వి సురేష్ బాబు, ఎఫ్ఓ బి.బి కృష్ణ ప్రసాద్, ఎఫ్ఓ బి జి భరణి కుమారు, ఎఫ్ బి ఓ కె.రఘుపతి రాజు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టుబడిన వ్యక్తిని జుడీషల్ కస్టడీ కోసం రాయచోటి అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేజ్ కోర్టుకు తరలించారు.
ఇది చదవండి:అన్నం తిన్నొచ్చే లోపులో విషాదం మిగిలింది!
ఇది చదవండి:మార్చి 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు
ఇది చదవండి:ఖమ్మం పాత బస్టాండ్‌పై పెద్దల కన్ను
ఇది చదవండి:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు!
ఇది చదవండి: ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త నిబంధనలు..ఇక జరిమానానే!
ఇది చదవండి: నాగచైతన్య ఖాతాలో మరో కొత్త లవ్‌స్టోరీ సాంగ్!