Red Sandal Wood Smuggling

Red Sandal Wood Smuggling : పెద్ద ఎత్తున ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ | Chittoor today news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్న చిత్తూరు పోలీసులు

Red Sandal Wood Smuggling : Chittoor : చిత్తూరు జిల్లాలో ఎర్ర చంద‌నం దుంగ‌ల స్మ‌గ్లింగ్ వ్యాపారం భారీ ఎత్తున జ‌రుగుతోంది. ఈ క‌మ్రంలో పోలీసులు శ‌నివారం చేప‌ట్టిన త‌నిఖీలో సుమారు రూ.2 కోట్ల విలువైన ఎర్ర చంద‌నం(Red Sandal Wood) దుంగ‌లు బ‌య‌ట ప‌డ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు మీడియాకు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

చిత్తూరు జిల్లాలో ఎర్ర చంద‌నం(Red Sandal Wood) అక్ర‌మ ర‌వాణాకు సంబంధించి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాలే మేర‌కు అడిష‌న‌ల్ ఎస్పీ ఎస్ఈబీ వై.రిశాంత్ రెడ్డి, చిత్తూరు రూర‌ల్ ఈస్ట్ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్ కె. బాల‌య్య ఆధ్వ‌ర్యంలో ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా పై రాబడిన స‌మాచారం మేర‌కు త‌నిఖీలు చేప‌ట్టారు. శ‌నివారం తెల్ల‌వారు సామున పెనుమూరు క్రాస్ వ‌ద్ద చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ స‌బ్ ఇన్స్పెక్ట‌ర్ య‌న్‌. విక్ర‌మ్‌, ఎస్ఈబీ వీరేష్‌, ఆర్ఎస్ఐ శ్రీ‌నివాస్‌, స్పెష‌ల్ పార్టీ సిబ్బంది వాహ‌నాల‌ను త‌నిఖీ చేప‌ట్టారు. తిరుప‌తి వైపు నుంచి చిత్తూరు వైపు ఒక దాని వెనుక ఒక‌టి ETIOS కారు మ‌రియు లారీలు అతివేగంగా వ‌స్తున్నాయి. పోలీసులు ఆపినా ఆప‌కుండా వాహ‌నాల‌ను గుద్ది పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే త‌నిఖీల్లో ఉన్న పోలీసులు అప్ర‌మ‌త్త‌మై రెండు వాహ‌నాల‌ను అడ్డుకున్నారు.

మాట్లాడుతున్న అడిషిన‌ల్ ఎస్పీ వై. రిశాంత్ రెడ్డి


అందులో న‌లుగురు వ్య‌క్తుల‌ను ప‌ట్టుకొనివారి వ‌ద్ద నుండి 5.2 ట‌న్నుల బ‌రువు గ‌ల 182 ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 2 కోట్లుగా ఉంటుంద‌ని పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్త‌న్నారు పోలీసులు.

గ‌తంలోనూ వీరిపైన కేసులు

ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాథ‌మిక విచార‌ణ మేర‌కు ఉమ్మ‌క్క శివ‌య్య అనే వ్య‌క్తి మీద గ‌తంలో క‌డ‌ప జిల్లా లో వేరు వేరు పోలీసు స్టేష‌న్ల‌లో 12 ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా కేసులు న‌మోదైన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఓ సారి పీడీ యాక్ట్ లో రిమాండ్‌కు వెళ్లిన‌ట్టు క‌నుగొన్నారు. కంబం కృష్ణ‌య్య అనే వ్య‌క్తి గ‌త‌లో ఫారెస్ట్ డిపార్టుమెంట్ లో క‌డ‌ప జిల్లాలోని రాజంపేట డివిజ‌న్ నందు తానాద‌ర్‌గా ప‌నిచేసి 2018లో రిటైర్డ్ అయిన‌ట్టు గుర్తించారు. ఈ ఎర్ర చంద‌నం దుంగ‌ల అక్ర‌మ ర‌వాణా వెనుక కొంత మంది ఆంధ్ర‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు ఉన్న‌ట్టు గుర్తించారు. వారిని ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *