Record Price Cooking Oil | రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచీగా చూపించి ఆయిల్ వ్యాపారులు మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఆయిల్ కొరత ఉంది. ధరలు ఇంకా పెరుగుతాయి అంటూ మాయమాటలు చెబుతున్నారు. వ్యాపారుల మాటలను చెవిన విన్న జనం ఇంకేముంది ముందు రోజుల్లో పరిస్థితి ఎలాం ఉంటుందోనని ఇప్పుడే ఆయిల్ ప్యాకెట్లు ఎక్కువ సంఖ్యలో (Record Price Cooking Oil) కొంటున్నారట.
ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను బురడీ కొట్టించిన కొందరు వ్యాపారులు నూనె రేట్లు పెరగడంతో పాటు దొరకడం కష్టమనే ప్రచారం చేసే పనిలో పడ్డారు. దీంతో ఎంత ధర ఉన్నా తప్పదుగా అంటూ సామాన్య ప్రజలు ఆయిల్ ప్యాకెట్లను కొనడం ప్రారంభించారు. ఒకేసారి లీటర్ ధరపై రూ.50 పెంచితే నూనె ఎలా కొనేదని మొత్తు కుంటున్నారు సామాన్య ప్రజలు. ఇప్పటికే కిరాణా దుకాణాల్లో లీటర్ నూనె ధర ప్యాకెట్ పైన రూ.20 తీసుకుంటున్నారని సామాన్య జనం వాపోతున్నారు.
ఇప్పటి వరకు కరోనా వల్ల రేట్లు పెరిగితే, ఇప్పుడు యుద్ధాలని చెప్పి రేట్లు పెరగడం ఇబ్బంది కలిగిస్తోందని సామాన్య జనం బాధ పడుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం పేరుతో కొందరు వ్యాపారులు కృత్రిక కొరతను చూపిస్తున్నారు. దీంతో ఏకంగా లీటర్ ప్యాకెట్ పై రూ.40 నుంచి రూ.50 వరకూ పెంచారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వంట నూనె ధరల మంట. అయితే కొందరు సామాన్య జనం ఇదేంటి ధరలు అమాంతం పెరిగాయా? అని ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం ఎక్సైజ్ సుంకం రేటు తగ్గిస్తే తగ్గుతాయని ఏదో ఒక కబురు చెబుతున్నారు. మూడు రోజుల కిందట రూ.140 ధర ఉన్న ఆయిల్ రేటు ఈ రెండు రోజుల్లో రూ.152కు పెరిగిందని వినియోగదారులు వాపోతున్నారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రక్క పెట్రోల్ డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజానీకానికి ఈ వంట నూనెలు ధరలు పెట్రోల్ ధరలు కన్నా పెరుగుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక బ్రతకాలి కదా! అన్నట్టు ప్రజలు సర్థుకుపోతున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!