Realtor Konda Anil: జనగామ అనుమానస్పద స్థితిలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండ అనిల్ మృతి చెందారు. జనగామ మండలం ఎర్రగొల్లపాడు గ్రామానికి ఆనుకొని రహదారి సమీపంలో అనుమానస్పద స్థితిలో మృతి చెంది యున్నారు. రోడ్డు ప్రక్కన పొలాల్లో ఆయన కారు నిలిచి ఉండగా పర్లాంగు దూరంలో ఆయన మృతదేహం పడి(Realtor Konda Anil) ఉంది.
హత్యా? ప్రమాదమా?
రియల్టర్ కొండ అనిల్ కారు బోల్తా పడి ఉంటుందా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొండ అనిల్ భువనగిరి, యాదాద్రి, హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో రియల్ వ్యాపారం చేస్తాడని తెలుస్తోంది. అంబర్ పేట శంకర్‌కు అత్యంత సన్నిహితుడుగా సమాచారం. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు జనగామ ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్‌కు చెందిన అనిల్ జనగామకు ఎందుకు వచ్చాడు? ఘటన స్థలంలో పడి ఉన్న ఇనుప తీగలు…ఎక్కడవి? అక్కడికి ఎలా వచ్చాయి? ఎందుకు ఎవరు ఉపయోగించారు? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. పోలీసులు అతని పూర్వపరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!