real estate frauds చల్లపల్లి : స్థలం ఒకరి దగ్గర తీసుకుని అపార్ట్మెంట్ కట్టడం, స్థల యజమానికి ఇవ్వాల్సిన ప్లాటులు ఇవ్వకుండా మోసగించడం, ప్లాట్ల అమ్మకాల్లోనూ మోసాలకు పాల్పడటం, ఒకరికి అగ్రిమెంట్ చేసి మరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం అవసరమైతే రిజిస్ట్రేషన్ చేయించుకునే వ్యక్తికి వాళ్ల ముఠాలోనే వ్యక్తే అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం..ఇలాంటి మోసాలకు కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీసులు అడ్డుకట్ట వేశారు. బిల్డర్‌ను, అతనికి సహకరించిన వారిని మంగళవారం అరెస్టు (real estate frauds)చేశారు.
చల్లపల్లి పోలీసు స్టేషన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో సీఐ జి.శ్రీనివాసు, ఎస్ఐ డి.సందీప్‌లు కేసు వివరాలు వెల్లడించారు. చల్లపల్లికి చెందిన మత్తి శ్రీవల్లి కృష్ణ ప్రియ సెప్టెంబర్ 10వ తేదీన పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. చల్లపల్లి బస్టాండు సెంటర్లోని పంచముఖ ఆంజనేయ స్వామి గుడి సందులో తనకున్న మూడు సెంట్ల స్థలము తన బాబాయ్‌కి ఉన్న స్థలంలో అపార్ట్మెంట్ కట్టి తనకు రెండు ప్లాట్లు ఇచ్చేలా మర్రి శ్రీనివాసరావు అనే బిల్డర్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆమెకు ఇవ్వాల్సిన ప్లాట్లులు ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయగా బిల్డర్ మర్రి శ్రీనివాసరావు వడ్డీ వ్యాపారి కొండవీటి నాగమల్లేశ్వరరావు, తోట నాగేశ్వరరావు, వెంకట వర ప్రసాద్, రంజిత్ కుమార్‌లు కలిసి మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. ప్లాట్లులు కొందరికి అగ్రిమెంట్లు చేసి డబ్బులు తీసుకోవడం, వాటినే వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు సంపాదించడం, ఇలా ఆరు ప్లాట్లకు సుమారు రూ.42 లక్షలు మోసం చేసినట్టు పోలీసులు నిర్థారించుకున్నారు. మోసాలకు పాల్పడిన సహకరించిన ఐదుగురిని అరెస్టు చేయగా, రిమాండ్‌కు పంపినట్టు సీఐ, ఎస్సై తెలిపారు. రియల్ ఎస్టేట్ మోసాలకు అడ్డుకట్ట వేసి నిందితులను అరెసు చేసిన చల్లపల్లి పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!