RBI Caution sRide App: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది. ఎస్‌రైడ్ యాప్ వాడేవారిని లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ యాప్‌ను మొబైల్లో వినియోగిస్తున్నట్లయితే వెంటనే డిలీట్ చేయాలని ఆర్బిఐ పేర్కొంది. ఎస్రైట్ టెక్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఆర్బిఐ వెల్లడించింది. ఈ కంపెనీ ప్రిపెయిడ్ ఇన్స్ట్ల్యూమెంట్ (వాలెట్) సేవలు కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఈ యాప్‌కు ఆర్బిఐ నుంచి ఎలాంటి అనుమతి(RBI Caution sRide App) లేదని తెలిపింది.
అందుకనే ఎవరైనా వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే తొలగించాలని పేర్కొంది. ఈ యాప్‌కు సంబంధించి ఎలాంటి సేవలు వాడొద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. ఒక వేళ ఇంకా యాప్ వినియోగిస్తే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 నిబంధనల ప్రకారం ఆర్బిఐ నుంచి అవసరమైన అనుమతులు పొందకుండా ఎస్‌రైడ్ టెక్ ప్రైవేటు లిమిటెడ్ తన కార్ పూలింగ్ యాప్ ఎస్‌రైడ్ ద్వారా సెమీ క్లోజ్జ్ (నాన్ క్లోజ్జ్) ప్రీ పెయిడ్ ఇనుస్ట్రమెంట్ ను నిర్వహిస్తోందని ఆర్బిఐ పేర్కొంది. అందుకే ఈ యాప్ నుంచి డబ్బులు చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులకు ఆర్బిఐ సూచించింది.

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు, రుణాలు పెరగడంతో అక్రమ రుణ యాప్‌ల సంఖ్య బాగా పెరిగింది. ఆన్లైన్ ప్లాట్‌ఫారంలు, మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు అందించే డిజిటల్ రుణాలపై వర్కింగ్ గ్రూపు నివేదికను వెల్లడించింది. అందుబాటులో ఉన్న 1100 లెండింగ్ యాప్‌లలో 600 వరకు చట్టవిరుద్ధమని సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. లెండింగ్ యాప్‌ల సంఖ్య పెరిగే కొద్దీ ఈ ట్రెండ్ పెరుగుతుందని, ఎందుకంటే లెండింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసే వినియోగదారులు అది చట్టబద్ధమైనదా? కాదా? అని గుర్తించలేరని తెలిపింది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ