Ray-Ban Smart Glasses కళ్లజోడును ఎందుకు వాడతామని అడిగితే ఇప్పటి వరకు ఎవరైనా సైటు కోసం, సూర్యరశ్మి నుంచి కళ్లకు ఉపశమనం కోసం వాడతాం అని చెబుతుంటారు కదా!. ఇకపై అంతమకు మించిన సౌకర్యాల కోసం వాడతామని చెప్పుకునే రోజులు వచ్చాయి. ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్బుక్ రే బాన్ స్టోరీస్(Ray-Ban Smart Glasses) 20 రకాల స్మార్ట్ కళ్లజోడును విడుదల చేసింది. అందులో కొత్తేముందని అనుకుంటున్నారా? ఇందులో 5 ఎంపీ కెమెరాతో ఫొటోలు తీసుకునే ఫీచర్ ఉంది.
అంతేకాదండోయ్.. 30 సెకన్ల వీడియోల్ని రికార్డు చేయొచ్చు. అది కూడా క్యాప్చరింగ్ బటన్‌తో పాటు ఫేస్బుక్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ ద్వారా టచ్ చేయకుండానే ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ప్రజలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అవకాశం మాత్రం ఉండదు.
ఇన్‌బిల్డ్‌గా వచ్చే ఎల్ఈడీ లైట్ సెటప్ క్యాప్చర్ కొట్టగానే ప్లాష్ ఇస్తుంది. దీంతో ఫొటోలు తీసే సమయంలో మన పక్కన ఉండేవారికి ఈ విషయం తెలిసిపోతుంది. అలాగే, ఇందులో వాయిస్ కమాండ్‌ను, ఆడియోను రికార్డు చేసేలా మూడు చిన్న మైక్రోఫోన్లు కూడా ఉంటాయి.


దీని ద్వారా మన ఫోన్లోని వీడియోలను కూడా ఈ కళ్లజోడులో చూసుకోవచ్చు. కళ్లజోడు ద్వారా తీసే వీడియోలను మన స్మార్ట్ ఫోన్లోనూ సేవ్ చేసుకోవచ్చు. అయితు, ఈ కళ్లజోడులో కృత్రిమ మేధా సాంకేతికతను వాడలేదు. భవిష్యత్తులో ఈ కళ్లజోళ్లను మరింత అభివృద్ధి చేసి మరిన్న ఫీచర్లతో ముందకు తెచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ కళ్లజోళ్లు అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, యూకేలో అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్లో, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో వీటిని విక్రయానికి ఉంచారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!