raw coconut water | ఎండలు మండిపోతున్నాయి. వేసవి రాకముందే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండే ఎండలకు ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. వేసవి తాపం నుండి coconut water ఆరోగ్య సంజీవనిగా ఉపకరిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి నీళ్లు(raw coconut water) తాగడంలో Health ప్రయోజనాలున్నాయి. అధిక శాతంగా ప్రజలు తక్షణ ఉపశమనం కోసం శీతల పానియాలను ఆశ్రయిస్తుంటారు. శీతల పానియాల వినియోగంతో దీర్ఘకాలంలో అనేక రుగ్మతలు ఎదురవుతాయనేది నమ్మలేని సత్యం. ఇప్పటికే Social Mediaలో శీతలపానియాల వినియోగం వద్దని అనేక వీడియోలు మన సెల్ ఫోన్లలో సాక్షాత్కరిస్తున్నాయి.
Telugu రాష్ట్రాల్లో కొబ్బరి బోండాలు

నగరంలో ఎక్కడ చూసినా కొబ్బరి బోండాలు అందుబాటులో ఉన్నాయి. ఈ బోండాలు ఎక్కువగా కేరళ, ఉభయ గోదావరి జిల్లాల నుండి వస్తుంటాయి. ఉభయ గోదావరి జిల్లాల బోండాల్లో నీరు అధిక శాతం ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల కాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవిలో cold drinkలతో పోల్చుకుంటే వచ్చే లాభాలు మాత్రం అనేకమనటంతో సందేహం లేదు. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం తీర్చేందుకు కొబ్బరి నీళ్లు ఆరోగ్య సంజీవనిగా ఉపకరిస్తుంది. vitamins & minerals, ఎంజైమ్లు, ఎమినో యాసిడ్లు, సైనో కిన్ అధికంగా ఉన్నాయి. వగరు రుచి దాని ఆరోగ్య ప్రయోజనాలకు మూలమని వైద్యులు చెబుతున్నారు. 100 మిల్లీ లీటర్ల కొబ్బరి waterలో 250 మిల్లీ గ్రాముల పొటాషియం, 105 గ్రాముల సోడియం లభిస్తాయి. ఆహారం ఎక్కువగా తీసుకోవాలన్న కోరికను తగ్గిసత్ఉంది. శరీరంలో చక్కెర స్తాయిలను నియంత్రించి అవసర మైన పోషకాలను అందిస్తుంది.
100లాది మందికి ఉపాధి!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నగరాల్లో వందలాది మంది Bondalu విక్రయాలతో ఉపాధి లభిస్తుంది. సుమారుగా 500 మంది కొబ్బరి బోండాలను తోపుడు బళ్ళు, స్థిరమైన దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారు జామున kobbari kayala lorryలు వస్తుంటాయి. నగర వ్యాప్తంగా 10 నుండి 15 లారీలు వస్తుంటాయి. లారీల వద్దకు చిరువ్యాపారులు చేరుకుంటారు. ఒక్కో వ్యక్తి 200 నుంచి 300 వరకు బోండాలు కొనుక్కొని ఆ రోజుకి తమ Business ప్రారంభిస్తారు. ప్రతి రోజూ ఇదే దినచర్యగా సాగుతుంది. కొన్ని సందర్భాలలో దళారులు ప్రభావం, లేక రవాణా రంగంలో ఇబ్బందులు ఎదురై దిగుమతి నిలిచిపోతుంది. ఈ సందర్భాల్లో కొబ్బరి బోండాల ధర అమాతంగా పెరుగుతుంది. రెట్టింపు అవుతుంది.