Ration Nagadu Badili Pathakam application | ఏపిలో రేషన్ సరుకులకు నగదు బదిలీ(Cash Transfer scheme of pds) అములు కాబోతుంది.కేంద్రం సూచనపై ఏపీ సర్కార్ కొత్త సూచనను అమలు చేయబోతుంది. అటు రేషన్ డీలర్ల కమిషన్‌పైనా దృష్టి పెట్టింది. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమలు చేయబోతుంది.
ఈ నగదు బదిలీ పథకం అంగీకర పత్రంలో ముందుగా మండల తహశీల్దార్, సహాయ సరఫరా అధికారి వారి కార్యాలయం పేరు రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రేషన్ కార్డు దారుడిన పేరు, జిల్లా, మండలం, గ్రామము, షాపు నెంబరు ఖాళీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కేజీ బియ్యంకు ధర చొప్పున నిర్ణయంకు అంగీకారం తెలుపుతూ ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది రేషన్ లబ్ధిదారుడు.

ఈ ప్రక్రియ ద్వారా బదిలీ కాబడిన నగదును వారియొక్క(రేషన్ దారుడు) లేక కుటుంబ సభ్యుల (రేషన్ కార్డు సభ్యులు) ఆధార్ కార్డు లింకు చేయబడిన బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను అంగీకార పత్రంలో పూర్తి చేసి అంగీకారం తెలుపుతున్నట్టు తెలపవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల కార్డు రద్దు కాదని, బియ్యం తప్ప మిగిలిన సరుకులను యథావిధిగా పొందవచ్చుని వాలంటీర్ ఆయా కుటుంబాలకు తెలియపర్చడం జరుగుతుంది.
పై వివరాలన్నీ పూర్తి చేసి నగదు బదిలీ పథకం అంగీకారపత్రం నింపిన తర్వాత వాలంటీర్ చదివి వినిపించగా నేను విని అర్థము చేసుకొని మనస్పూర్తిగా ఆమోదము తెలియజేస్తున్నానని తెలిపి రేషన్ దారుడు సంతకం లేదా వేలిముద్ర,పేరు, గ్రామము, మండలం, జిల్లా పేరు వివరాలు పూర్తి చేసి, ఆ తర్వాత వాలంటీర్ సంతకం చేయాల్సి ఉంటుంది.
Ration Nagadu Badili Pathakam application link:
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ