Rasi Phalalu (7th Mar 2022) | ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. అన్ని రాశి ఫలాలకు సంబంధించి క్రింద ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ రాశికి సంబంధించి విపులంగా వివరించాము. ప్రతి ఒక్కరి రాశి ఫలం గురించి తెలుసుకొని దాని ద్వారా లాభం పొందండి. సోమవారం 07.03.2022 తేదీకి సంబంధించిన రాశిఫలాలు ఇప్పుడు తెలుసుకోవచ్చు సులువుగా Rasi Phalalu (7th Mar 2022).
మేషరాశి(07.03.2022)
ఎవర్నీ మీకోసం పనులు చేయమని బలవంతం చేయవద్దు. ఇతరుల అవసరాలు, వారి ఇష్టాలు గురించి ఆలోచిస్తే అది మీకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. ఖర్చులు మాత్రం అదుపు చేయండి. ఈ రోజు ఖర్చులలో విలాసాలకు ఎక్కువ ధనం కరిగిపోకుండా చూసుకోగలరు. ఇతరులను సంతోష పరిచే మీ స్వభావం, గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తోంది. దేనికి ఆందోళన పడకండి. ఐస్ క్రీంను ఇష్ట పడండి. ఎందుకంటే మీ విచారం కూడా ఐస్ లాగానే కరిగినీరైపోతుంది. మీ ఆఫీసులో మీకు ఒక అద్భుతమైన రోజుల కన్పించవచ్చు. ఖాళీ సమయాన్ని మీ ఆప్త మిత్రులతో గడిపే అవకాశం ఉంది. ఇటీవల కొన్ని దుసఃఘటనలు జరిగినా, మీ పట్ల తనకు ఎంతటి ప్రేమ, ఆరాధన భావముందో మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు గుర్తు చేయబోతుంది.
ఆరోగ్యం – 2/5
సంపద – 3/5
కుటుంబం – 5/5
ప్రేమ సంబంధిత విషయం – 3/5
వృత్తి – 3/5
వివాహితుల జీవితం – 3/5.
వృషభ రాశి(07.03.2022)
గ్రహ చలనం రిత్యా మీకున్న ఆకాంక్ష, కోరిక, భయం వల్ల అణగారిపోయే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితి నుండి బయట పడేందుకు కొంత సరియైన సలహా మీకు అవసరం. అవసరమైన డబ్బు లేకపోవడంతో కుటుంబంలో అసమ్మతికి కారణం అవుతుంది. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించి వారియొక్క సలహాలను తీసుకోండి. ఈ రోజు మీ ఇంటికి అద్భుతమైన రోజుగా అతిథులు వస్తారు. ప్రేమకు ఉన్న శక్తి వల్ల మీకు ప్రేమించేందుకు ఒక కారణం చూపబోతుంది. మీ ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారు చేసే తప్పుడు పనుల ప్రభావ ఫలితాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. కుటుంబంలో మీరు చిన్నవారితో సమయం ఎలా గడపాలో తెలుసుకోండి. కుటుంబ ప్రశాంతకు ఎటువంటి ఆటంకం ఉండదు. తన జీవితంలో మీ విలువలను గొప్పగా వర్ణించడం వల్ల మీ భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనంద పరచనున్నారు.
ఆరోగ్యం-1/5
సంపద -1/5
కుటుంబం -4/5
ప్రేమ సంబంధిత విషయం- 5/5
వృత్తి -3/5
వివాహితుల జీవితం -5/5.
మిథున రాశి(07.03.2022)
మీ జీవితాన్ని ఆనందంగా గడపటానికి అంతటినీ అనుభవించేందుకు సంసిద్ధవ్వండి. ఆందోళనలేమీ లేకుండా ఉండటమే మీరు వేసే తొలి అడుగు ఇది. వ్యాపారస్తులకు, ట్రేడింగ్ వారు లాభాలు పొందే అవకాశం ఉంది. మీ క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రేమలో బాధను అనుభవించవచ్చు. ప్రముఖ వ్యక్తులతో మాట్లాడండి. మీకు మంచి ఆలోచనలు, ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ మీకోసం తాను ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తుంది.
ఆరోగ్యం- 3/5
సంపద – 5/5
కుటుంబం – 3/5
ప్రేమ సంబంధిత విషయం – 2/5
వృత్తి – 5/5
వివాహితుల జీవితం- 2/5.
కర్కాటక రాశి(07.03.2022)
మిత్రులతో సాయంత్రం వేళ కలిసి మాట్లాడటం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అతిగా తినవద్దు. ఇది మరో రోజుకు ఉదయాన్నే ఇబ్బంది కలిగించవచ్చు. ఈ రోజు మీరు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త వాటిని కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుంది. మీ తండ్రి కఠినత్వం మీకు కోపం తెప్పించే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వల్ల మీకు మేలు కలుగుతుంది. ప్రముఖలతో కలిసి మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీ కీర్తిని భాగా దెబ్బతీసే అవకాశం ఉండొచ్చు.
ఆరోగ్యం- 1/5
సంపద -4/5
కుటుంబం- 1/5
ప్రేమ సంబంధిత విషయం- 1/5
వృత్తి -5/5
వివాహితుల జీవితం- 1/5.
సింహరాశి(07.03.2022)
ఈ రోజు విజయం మీకు అందుబాటులో ఉన్నట్టే ఉండబోతుంది. ఎవరో ఒకరు మాత్రం మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారు ఎవరో ముందుగానే తెలుసుకోండి. ఇక కుటుంబం కోసం కష్టపడి పని చేయాలి. మీరు దురాశను వదిలి, ప్రేమ, సానుకూల దృక్ఫథంతో నడవాలి. మీ ప్రియమైన వారు బాధలో ఉన్నప్పుడు మీ చిరునవ్వు వారి బాధ పోగొట్టే విరుగుడు కాగలదు. మీరు చేస్తున్న పనిలో వస్తున్న మార్పులతో ప్రయోజనం కలగబోతుంది. మీ ఖాళీ సమయాన్ని మీ తల్లి గారి అవసరాల కోసం వినియోగించుకోవాలనుకుంటారు కానీ వేరే అర్జెంట్ పని వల్ల వీలుకుదరక పోవచ్చు. మీ జీవిత భాగస్వామి తో మీ వివాహ జీవితం తాలూక అత్యుత్తమమైన రోజైన ఈ రోజు మంచి అనుభూతి పొందుతారు.
ఆరోగ్యం- 1/5
సంపద- 1/5
కుటుంబం- 5/5
ప్రేమ సంబంధిత విషయం- 5/5
వృత్తి -5/5
వివాహితుల జీవితం- 5/5.
కన్యారాశి(07.03.2022)
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ముఖ్యంగా మూల మలుపుల వద్ద జాగ్రత్తగా ఉండండి. ఎదురుగా వచ్చే వారి నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించొచ్చు. శాలరీలు రాలేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో స్నేహితులను అప్పుగా కొంత డబ్బును అడుగుతారు. ఈ రోజు మీకు స్నేహితులతో గడపే సమయం దొరకనుంది. డ్రైవింగ్ చేసేసమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఒత్తిడిలో ఉన్న మీ మనస్సుకు మీ ప్రియమైన వారి వల్ల మీకు ఆహ్లాదం దొరకుతుంది. విశ్వాసం పెరుగుతోంది. అభివృద్ధిని చూస్తారు. ఇప్పటి వరకు వాయిదా పడ్డ పనులు ఈ రోజు చేసేందుకు సమయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి సంతోషంగా కలిసి గడపనున్నారు.
ఆరోగ్యం -1/5
సంపద -1/5
కుటుంబం -2/5
ప్రేమ సంబంధిత విషయం – 3/5
వృత్తి- 5/5
వివాహితుల జీవితం- 3/5.
తులా రాశి(07.03.2022)
మీకు ఒంట్లో శక్తి ఉన్నప్పటికీ పని ఒత్తిడి వల్ల మీరు చిరాకు పడేలాగ చేయవచ్చు. మీ ఇంటి గురించి పొదుపు చేయడం లాభం చేకూర్చనుంది. ఎప్పుడో ఒకసారి కలిసే వ్యక్తులకు సమాచారం అందించేందుకు ఈ రోజు మంచి రోజు. ఈ రోజు మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తుంది. కోపాన్ని కూడా మీపై చూసే అవకాశం ఉంది. కాబట్టి అదే సమయంలో మీరు తిరిగి కోప్పడకుండా మీ భాగస్వామి కోపంకు కారణం ఏమిటో నెమ్మదిగా తెలుసుకోండి. మిమ్మల్ని ద్వేషించే వారు మిమ్మల్ని ఈ రోజు హలో అనవచ్చు. ఆఫీసులో అద్భుతం చేకూరనుంది. ఓ పెద్ద మనిషి మీకు మార్గ దర్శనం చేయబోతున్నారు. షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అయిష్టంగా ఉంటారు.
ఆరోగ్యం- 4/5
సంపద- 5/5
కుటుంబం -5/5
ప్రేమ సంబంధిత విషయం – 2/5
వృత్తి- 3/5
వివాహితుల జీవితం- 2/5.
వృశ్చిక రాశి(07.03.2022)
ఈ రోజు మూతలేని ఆహార పదార్థాలను తినవద్దు. అవి తింటే మీరు అనారోగ్యం పాలు చేస్తుంది. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. మీకు ఈ రోజు గొప్పరోజు. మికు ఇష్టమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడగవచ్చు. కానీ మీరు వారి కోర్కెలు తీర్చలేరు. కాస్త మీ ప్రియమైన వారు దీంతో విచారానికి లోనవుతారు. మీరు బయటకు వెళుతున్న సమయంలో పెద్దవారితో కలిసి మాట్లాడతారు. పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది.
ఆరోగ్యం- 1/5
సంపద- 3/5
కుటుంబం -3/5
ప్రేమ సంబంధిత విషయం- 3/5
వృత్తి -2/5
వివాహితుల జీవితం -3/5.
ధనస్సు రాశి(07.03.2022)
మీకు పనులు చేసుకునేందుకు, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపర్చేందుకు సరిపడ సమయం దొరుకుతుంది. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. కొన్ని ఆర్థిక లాభాలను ఈ రోజు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇంటి విషయాలను పరిశీలించి పరిష్కరించాల్సి ఉంది. ఈ రోజు మంచి ఎదుగుదలకు అవకాశముంది. మీ కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడం ద్వారా సమయాన్ని గడుపుతారు. మీ భాగస్వామితో రుమాన్స్ చేయబోతున్నారు. ఆమె మీకు పాత జ్ఞాపకాలను గుర్తు చేయనుంది.
ఆరోగ్యం- 4/5
సంపద- 4/5
కుటుంబం- 1/5
ప్రేమ సంబంధిత విషయం- 5/5
వృత్తి- 3/5
వివాహితుల జీవితం- 5/5.
మకర రాశి(07.03.2022)
గాలిలో మేడలు కట్టడం మీకు సహాయపడదు. మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఈ రోజు, మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగానే ఉంటాయి. మీ పరిశ్రమ, కష్టం రాణింపుకి వస్తాయి. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగ చేయడానికి సహాయపడతుంది. మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
ఆరోగ్యం- 1/5
సంపద- 2/5
కుటుంబం- 2/5
ప్రేమ సంబంధిత విషయం – 1/5
వృత్తి- 2/5
వివాహితుల జీవితం- 1/5.
కుంభ రాశి(07.03.2022)
మీరు టెన్షన్ పడవద్దు. మీ కుటుంబ సహాయాన్ని, సహకారాన్ని హుందాగా స్వీకరించండి. మీ భావాలను నొక్కి పెట్టి ఉంచాల్సినవ్వసరం లేదు. అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవల్సి ఉంటుంది. పిల్లల అవసరాలను కూడా చూడాలి. మీ ప్రేమిక భాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి. మీ ముఖ్యమైన విషయాలపై ధ్యాప పెట్టాలి. స్వర్గం భూమ్మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు.
ఆరోగ్యం- 1/5
సంపద -3/5
కుటుంబం- 3/5
ప్రేమ సంబంధిత విషయం – 5/5
వృత్తి -5/5
వివాహితుల జీవితం- 5/5.
మీన రాశి(07.03.2022)
తగువులను చేయకుండా అదుపులో ఉండండి. దీని వల్ల మీ బంధుత్వాలు శాశ్వతంగా నాశనం చేసేయగలదు. మీ జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో మాట్లాడండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి అతిథులు మీ ఇంటికి ప్రవాహం లాగా వచ్చేస్తారు. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడగబోతున్నారు. టూరిజంలో మంచి ఆకర్షణీయమైన ఆదాయం రావచ్చు. ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీని వల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది.
ఆరోగ్యం -1/5
సంపద- 2/5
కుటుంబం- 5/5
ప్రేమ సంబంధిత విషయం – 3/5
వృత్తి -4/5
వివాహితుల జీవితం- 3/5.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ