Rani Soyamoyi’s character: ‘మేక‌ప్ వేసుకోని క‌లెక్ట‌ర్’ రాణి సోయ‌మోయి క‌థ క‌ల్పిత‌మే!

Rani Soyamoyi’s character మేక‌ప్ వేసుకోని క‌లెక్ట‌ర్ గురించి ప్ర‌చారం అవుతున్న స్టోరీ ఫేక్ అంట‌. జార్ఘండ్‌కు చెందిన రాణి సోయ‌మోయి అనే ఐఏఎస్ అధికారి ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేరంట‌. కేవ‌లం ఈ స్టోరీ, ఆమె పేరుతో ఓ మ‌ల‌యాళి ర‌చియిత క‌ల్పించిన ర‌చ‌న అంట‌. కానీ ఈ స్టోరీ ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. కొద్ది రోజులుగా రాణి సోయ‌మోయి క‌థ బాగా వైర‌ల్(Rani Soyamoyi’s character) అయ్యింది.

క‌థ నేప‌థ్యం ఎలా ఉందంటే మ‌ల‌ప్పురం జిల్లాలో రాణి సోయ‌మోయి అనే క‌లెక్ట‌ర్ ఒక కాలేజీకి వెళుతుంద‌ని, ఆమెను ఒక స‌న్న‌ని అమ్మాయి మేడం మీరు మేక‌ప్ ఎందుకు వేసుకోరు అని ప్ర‌శ్నిస్తుంది. ఇందుకు క‌లెక్ట‌ర్ రాణి సోయ‌మోయి ఒక 10 నిమిషాలు మీకు టైం ఉంటే నాకు చెప్ప‌గ‌ల‌రు అని విద్యార్థుల‌ను అడ‌గ‌గా వారు స్పందించి ఓకె చెబుతారు. అప్పుడు క‌లెక్ట‌ర్ రాణి సోయ‌మోయి త‌న చిన్న‌నాటి క‌ష్టాల‌ను, కుటుంబ నేప‌థ్యం ను విద్యార్థుల‌కు వివ‌రిస్తుంది.

ఈ క‌థ‌లో త‌న కుటుంబం గిరిజ‌న తెగ‌కు చెందిన‌ది అని. త‌నకు ఒక చెల్లి, ఇద్ద‌రు అన్న‌దమ్ములు ఉన్నార‌ని, త‌ల్లిదండ్రులు చాలా పేద‌వారు అని కూడా చెబుతుంది. ఈ స్టోరీలో ఒక గ‌నిలో ప‌నిచేసేందుకు త‌న కుటుంబం వెళుతుంద‌ని వివ‌రిస్తుంది. మైకా మైన్స్ అనే గ‌నిలో ప‌నికి వెళ‌డంతో పాటు అక్క‌డ విష‌వాయువులు పీల్చ‌డం వ‌ల్ల త‌న చెల్లి, తండ్రి చ‌నిపోయార‌ని కూడా చెబుతుంది. ఇద్ద‌రు అన్న‌లు కూడా ఆక‌లితో అల‌మ‌టించి చ‌నిపోయార‌ని, ఒక రోజు భోజ‌నం ల‌భించ‌డమే త‌మ కుటుంబానికి క‌ష్ట‌మ‌ని ఎన్నో రాత్రులు ప‌స్తులు ఉన్న‌రోజులు ఉన్నాయ‌ని ఆవేద‌న‌తో క‌న్నీళ్ల‌తో విద్యార్థుల‌కు వివ‌రిస్తుంది. ఈ క్ర‌మంలో త‌న కుటుంబం ప‌డిన బాధ‌లు, త‌న త‌ల్లి ప‌డిన బాధ‌లతో నేను సంతోషంగా ఎలా ఉండ‌గ‌ల‌ను. ఎలా మేక‌ప్ వేసుకోగ‌ల‌ని చెబుతుంది. వాస్త‌వానికి ఈ క‌థ పూర్తిగా చ‌దివితే మ‌న‌కు క‌న్నీళ్లు కూడా ఆగ‌వు. అంత మాన‌వీయ కోణంలో స‌గ‌టు కుటుంబం ప‌డిన క‌ష్టాల గురించి మ‌న‌కు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు స్టోరీ ఉంటుంది.

క‌ల్పిత క‌థ‌!

ఈ స్టోరీపై ఎన్నో మీడియా సంస్థ‌లు, ఎంతో మంది గూగుల్ లో ఆమె ఎవ‌రు? అని వెతికారు. కానీ ఈ స్టోరీకి సంబంధించి గూగుల్‌లో ఎలాంటి వివ‌రాలు లేవు. రాణి సోయ‌మోయి గురించి కూడా ఎక్క‌డా లేదు. ఈ స్టోరీకి సంబంధించి 2020 సంవ‌త్స‌రంలో ఓ ప్ర‌ముఖ ప‌త్రిక (times of india’s)లో ఒక క‌థ ప్ర‌చురిత మైన‌ది. అప్ప‌టి నుంచి ఈ క‌థ ప్ర‌చారంలో ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. వాస్త‌వానికి ఈ రాణి సోయ‌మోయి క‌థ‌ను హ‌కీమ్ మోరే అనే ర‌చ‌యిత మ‌ల‌యాళంలో రాశారు. ఇది కేవ‌లం క‌ల్పిత క‌థ మాత్ర‌మే. ఇంత పెద్ద‌గా వైర‌ల్ అవుతున్న రాణి సోయ‌మోయి స్టోరీని రాశిని ఆ మ‌ల‌యాళం ర‌చ‌యిత‌ను అభినందించాల్సిందే.

Share link

Leave a Comment