Rani Rudrama Reddy who visited Khammam
Khammam: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ గిరిజన, మైనింగ్ యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని యువత తెలంగాణ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ఖమ్మం పట్టణంలోని ప్రచారం నిర్వహించారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో వెంటనే ప్రభుత్వ, గిరిజన, మైనింగ్ యూనివర్శిటీలు (3) ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కొరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా చింతకాని కోచ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరారు. వామపక్ష భావాజాలం కలిగిన వ్యక్తిగా చెప్పుకునే శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ ప్రాంతంలో ఒక్క ప్రభుత్వ యూనివర్శిటీ కూడా తీసుకురాకపోవడం శోచనీయమన్నారు. కానీ ఈ ప్రాంతానికి యూనివర్శిటీ లేకుండా తనకు సొంత యూనివర్శిటీ తెచ్చుకున్నారని విమర్శించారు. ముఖ్యంగా గ్రానైట్ ఇండస్ట్రీని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని అన్నారు. రాబోయే పట్టభద్రుల ఎలక్షన్లలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, పోరాడే వ్యక్తిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ ఖమ్మ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ, టిపిఎల్ఎ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి రాజేశ్వర్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు, యువత తెలంగాణ పార్టీ నాయకులు మురళి, కిషోర్, కళ్యాణి, నీహారిక, దినేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి : ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు
ఇది చదవండి : ఇక ఫుల్ డే తరగతులు..వేసవి సెలవులు రద్దు!
ఇది చదవండి : నగరానికి పయనం..హైవేపై భారీ ట్రాఫిక్ జామ్!
ఇవి చదవండి: సరిహద్దులో గణతంత్ర వేడుకలు రద్దు